- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను ఈ ముగ్గురికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను.. మహేష్ ఎమోషనల్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), స్టార్ డైరెక్టర్ మారుతి(Maruti) కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab).

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), స్టార్ డైరెక్టర్ మారుతి(Maruti) కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab). నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇక పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో రూపొందించిన ఈ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఖైతలపూర్ గ్రౌండ్స్‌లో ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇక ఈ ఈవెంట్‌లో కమెడియన్ మహేష్ అచంట ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అంతా మంచి జరగాలి. 2026లో మనం కనిపించబోయే ఫస్ట్ సినిమా ప్రభాస్ అన్నది.
మారుతి సార్ నాకు ఇందులో కనిపించే అవకాశం ఇచ్చారు, ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇచ్చారు, ప్రభాస్ అన్న టీ షర్ట్ ఇచ్చారు. వీళ్ల ముగ్గురికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ సినిమాలో మనం ఒక్క షార్టులో కనిపించినా మన జన్మ ధన్యం. ఆ చాన్స్ నాకు వచ్చింది.. అందుకే ఈ ముగ్గురికి రుణపడి ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.






