- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Raj Kumar Rao : నేను ఇంట్లో గిన్నెలు కడుగుతాను : బాలీవుడు నటుడి సంచలన వ్యాఖ్యలు
తాను ఇంట్లో గిన్నెలు కడుగుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ బాలీవుడ్ నటుడు.

దిశ, వెబ్ డెస్క్ : తాను ఇంట్లో గిన్నెలు కడుగుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ బాలీవుడ్ నటుడు. బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు(Bollywood Actor Raj Kumar Rao) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకునే కొద్ది మంది ప్రత్యేక యాక్టర్స్ లో రాజ్ కుమార్ ఒకరు. 'సిటీ లైట్స్' (City Lights) సినిమాలోని తన సహనటి పత్రలేఖ(Patralekha)ను.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమించి, 2021లో పెళ్లి చేసుకున్నారు. అయితే రీసెంట్‌గా ఒక బ్రాండ్ ప్రమోషన్(Brand Pramotion)లో భాగంగా.. వీరిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ మాట్లాడుతూ.. భార్యభర్తలు కష్టసుఖాలనే కాదు ఇంటిపనులు కూడా పంచుకోవాలని తెలిపాడు.
ఇక తమ వైవాహిక జీవితంపై పత్రలేఖ స్పందిస్తూ.. మా పెళ్లి అయిన అనంతరం ప్రతి పనిని షేర్ చేసుకోవాలి అనే నియమం పెట్టుకున్నామని, అదే నియమాన్ని ఇప్పటికి ఫాలో అవుతున్నాం. నేను వంట చేస్తే తాను అంట్లు తోముతాడు. నేను ఇల్లు ఊడిస్తే.. తాను అన్నింటిని చక్కగా సర్థుతాడు అంటూ చెప్పుకోచ్చింది. ఇదే విషయంపై రాజ్ కుమార్ రావు స్పందిస్తూ.. పెళ్లి అనంతరం మనం చేసే చిన్న చిన్న విషయాలు కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. తాను వంట చేస్తే నేను అంట్లు తోమడం వంటి పనులు చేస్తా. అవి ఇష్టంతోనే చేస్తా. తాను ఇంట్లో ఉన్నా లేకున్నా నా పని నేను చేస్తాను. తాను కూడా అంతే అంటూ రాజ్ కుమార్ రావు చెప్పుకోచ్చాడు. భార్యపై ప్రేమతో ఇంట్లో పనులు చేయడం సహజమే అయినా.. వాటిని బహిరంగంగా ఒప్పుకోరు. నామోషీగా ఫీల్ అవుతారు. కాని ఇండస్ట్రీలో అంత గొప్ప పేరు ఉన్నప్పటికీ తాను గిన్నెలు కడుగుతాను, అన్ని పనులు చెరిసగం చేస్తామని బహిరంగంగా చెప్పుకోవడం మాత్రం గ్రేట్ అని చెప్పుకోవచ్చు.






