- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సమయంలో మానసికంగా చాలా కృంగిపోయా.. విపరీతంగా ఏడ్చాను.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె(Deepika Padukone) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898AD) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె(Deepika Padukone) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898AD) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దిశా పటానీ(Disha Patani), కీర్తి సురేష్(Keerthi Suresh) వంటి స్టార్స్ యాక్ట్ చేశారు. అయితే గత ఏడాది జూన్ 27న రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా కలెక్షన్ల విషయంలోనూ ఎన్నో రికార్డులు తిరగరాసింది.
ఇక దీపిక పదుకొణె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే స్టార్ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh)తో ప్రేమలో పడింది. అలా అతనితో కొన్నేళ్లు డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంది. ఇక రీసెంట్‌గా ఈ జంటకు ఒక పాప పుట్టింది. అయితే ఇంకా ఈ చిన్నారి ఫేస్‌ని మాత్రం రివీల్ చేయలేదు. ఈ క్రమంలో ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక తన కెరీర్‌లో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘2014లో నా కెరీర్ పీక్స్‌లో ఉన్న క్షణాలు అవి. అసలు తీరిక లేకుండా సినిమాలు చేస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అలాంటి టైంలో ఓ సారి తీవ్ర అలసటకు గురై లొకేషన్‌లోనే కళ్లు తిరిగి పడిపోయా. ముందు లైట్ తీసుకున్నాను. కానీ ఎందుకో మనసు కీడు శంకించింది. దీంతో అవసరమైన స్కానింగ్‌లు, టెస్టులు చేయించుకున్నాను. నా పరిస్థితి అంత బాలేదని అర్థమైంది. ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే సమస్యలే అయినప్పటికీ ఏదో అయిపోతున్నట్టు భయపడేదాన్ని. విపరీతంగా ఏడ్చేసేదాన్ని. అలా మానసికంగా చాలా కృంగిపోయా. నా విషయం తెలుసుకుని మా అమ్మ నన్ను చూడటానికి ముంబాయి వచ్చింది.
అమ్మ సూచన మేరకు థెరపిస్ట్‌ను కలిశాను. నేను థెరపిస్ట్ వద్దకు వెళ్తున్న విషయాన్ని గోప్యంగా ఉంచమని అమ్మ చెప్పింది. అమ్మ మాట మీద ఎవరికీ తెలీకుండా సీక్రెట్‌గా థెరపీ తీసుకునేదాన్ని. స్లోగా దాని నుండి క్యూర్ అయిన తర్వాత నా మానసిక ఆరోగ్యం గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగాను. అప్పుడు అనిపించింది మా అమ్మ ఈ విషయం ఎందుకు గోప్యంగా ఉంచమన్నదో. నేను ‘లివ్ లాఫ్ లవ్’ ఫౌండేషన్ స్థాపించడానికి కారణం కూడా అవే’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీపిక పదుకొణె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






