- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో పదే పదే స్త్రీల శరీరాల గురించే మాట్లాడతారు.. ప్రభాస్ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్
కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) గత ఏడాది ‘తంగలాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

దిశ, సినిమా: కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) గత ఏడాది ‘తంగలాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ది రాజాసాబ్’(The Rajasaab) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే మారుతి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై దీనిని టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) నిర్మిస్తున్నారు. అయితే ‘ది రాజాసాబ్’మూవీ షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుండటంతో రిలీజ్ వాయిదా పడింది.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్ ఇండస్ట్రీలో స్త్రీలను చూసే విధానం గురించి పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రతి పరిశ్రమలో ఆదర్శవంతమైన స్త్రీల శరీరం గురించి విభిన్న ఆలోచన ఉంటుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను కాస్త బొద్దుగా అయి సినిమా ఆఫర్ల కోసం ముంబైకి వెళ్తే.. మీరు పని చేయడం మానేశారా అందుకే ఇలా తయారయ్యారా? అని అన్నారు. దీంతో నేను ఆ తర్వాత ఫిట్‌గా అయి వెళ్లాను. అప్పుడు అయ్యే మీరు సన్నగా మారిపోయారు.
చబ్బీగా ఉన్నప్పుడే క్యూట్‌గా ఉండేవారని చెప్పారు. ఆడవారి శరీరాల గురించి తరచూగా వ్యాఖ్యానిస్తారు. ఒకానొక సమయంలో నేను గందరగోళానికి గురయ్యాను. ఫిట్‌గా ఉండాలా.. లేక బొద్దుగా ఉండాలా అనే కన్ఫూజన్‌కు వచ్చేశాను. కానీ ఫైనల్‌గా ఆరోగ్యంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. అయితే నేను సన్నగా ఉన్నప్పుడు చాలా ట్రోల్ చేశారు. నా 20 ఏళ్ల మధ్యలో నా శరీరం మారిపోయింది. ఆ సమయంలో కఠినంగా ఉండేది. ట్రోల్స్ నన్ను చాలా ప్రభావితం చేశాయి’’ అని చెప్పుకొచ్చింది.






