ఆమె నన్ను అంత మాట అనడంతో షాకయ్యాను.. నటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సిమ్రాన్ (వీడియో)

by Mallepaka Hamsa |

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్(Simran) కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఆమె నన్ను అంత మాట అనడంతో షాకయ్యాను.. నటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సిమ్రాన్ (వీడియో)
X

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్(Simran) కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. నాగార్జున(Nagarjuna), చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna),శ్రీకాంత్ వంటి వారితో నటించి ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఇటీవల ‘శబ్దం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా, ఓ అవార్డు వేడుకల్లో పాల్గొన్న సిమ్రాన్ తనకు ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకుంది. ‘‘నేను గతంలో ఓ నటికి నటించిన సినిమా చూసి మెసేజ్ చేశాను. అమె రోల్‌ను చూసి నేను సర్‌ప్రైజ్ అయ్యానని మెచ్చకున్నాను. దానికి ఆమె వెంటనే రిప్లై ఇచ్చింది.

అంటీ రోల్స్ చేయడం కంటే ఇది ఎంతో బెటర్ అని చెప్పింది. నిజానికి ఆమె పంపిన మెసేజ్ చూసిన నేను షాక్ అయ్యాను. అలాంటి మెసేజ్‌ను పెడుతుందని ఊహించలేదు. ఆ తర్వాత సైలెంట్‌గా ఉన్నాను. కానీ దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. పనికిమాలిన డబ్బా రోల్స్ నటించడం కంటే ఆంటీ, అమ్మ పాత్రలు నటించడం బెటర్ అని నేను భావిస్తున్నా. మనం ఏ పని చేసినా కాన్ఫిడెంట్‌గా ముందుకు సాగాలి. మనపై మనం నమ్మకం ఉంచినప్పుడే వర్క్ కూడా అనుకున్న విధంగా చేయగలుగుతాం. కాబట్టి దేనిని చులకనగా చూడకూదని నా అభిప్రాయం’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సిమ్రాన్ ఇదంతా లైలా గురించే చెప్పిందని నెట్టింట చర్చలు జరుగుతున్నాయి.

Next Story