- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్‌తో ఆ సినిమా చేసినప్పుడు అమ్మ చెప్పిన మాట విని షాకయ్యాను.. అనుష్క శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నాగార్జున(Nagarjuna) నటించిన ‘సూపర్’(Super) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి(Anushka Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున(Nagarjuna) నటించిన ‘సూపర్’(Super) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి(Anushka Shetty) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా ప్రభాస్(Prabhs), అనుష్క జోడికి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరి కాంబో అంటే సూపర్ హిట్ కావాల్సిందే. ఇప్పటికీ ప్రభాస్‌ను అన్నయ్య అని అనుష్కను వదిన అని ఫీల్ అయ్యే వాళ్లు చాలా మంది ఉన్నారు. వీరు పెళ్లి చేసుకుంటే ఆనంద పడే వాళ్లలో ఫస్ట్ నెటిజన్లే ఉండటం విశేషం.
అయితే ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మెహర్ రమేష్(Mehar Ramesh) తెరకెక్కించిన ‘బిల్లా’(Billa) సినిమాలో అనుష్క కథానాయికగా నటించింది. ఇందులో అనుష్క డ్రెస్సింగ్, లుక్స్ గురించి చెప్పక్కర్లేదు. గ్లామర్ లుక్స్‌తో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. అయితే మూవీలో కనిపించే అనుష్కకు.. బయట కనిపించే స్వీటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత తన తల్లి చెప్పిన మాటలు విని షాకయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అనుష్క.
ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ పద్ధతిగా ఉండాలని మా అమ్మ అనుకుంటుంది.. అలాంటి ఆమె బిల్లా సినిమా చూసి ఇంకా స్టైలిష్‌గా ఉండొచ్చు కదా.. సగం పద్దతిగా, సగం మోడ్రన్‌గా ఆ డ్రెస్సులేంటీ అని అన్నది. దీంతో నేను ఎంతో షాకయ్యాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అప్పట్లో స్వీటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.






