- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రోజు కృష్ణవంశీ అన్న మాటలకు షాక్ అయ్యాను.. ఆసక్తికర విషయాలు చెప్పిన తాగుబోతు రమేష్
"ఏ ఊరు రా నీది? ఇంత గొప్ప పెర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చావు?" అని కృష్ణవంశీ ప్రశంసించినట్లు రమేష్ వెల్లడించాడు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వారిలో తాగుబోతు రమేష్ ఒకరు. ఆయనకు భారీ గుర్తింపును తెచ్చిపెట్టిన చిత్రాల్లో అలా మొదలైంది ముందువరుసలో ఉంటుంది. ఈ సినిమాలో తాగుబోతు పాత్రలో ఆయన పండించిన కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాంతో ఆయనకు స్టార్ కమెడియన్‌గా మంచి పేరు వచ్చింది. అనంతరం కొన్ని సంవత్సరాల పాటు వరుస అవకాశాలతో కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించారు.
అయితే ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడంతో కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తాగుబోతు రమేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన మహాత్మ సినిమాలో తనకు అవకాశం ఎలా వచ్చిందో కూడా గుర్తుచేసుకున్నారు. తాజాగా తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.. "నాకు ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడంతో కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు సినిమా ఆడిషన్స్‌కు వెళ్లేవాడిని.
అలాంటి సమయంలో కృష్ణవంశీ గారు మహాత్మ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఉత్తేజ్ గారు నాకు గురువులాంటి వారు. ఆయన వల్లే మహాత్మ సినిమా ఆడిషన్స్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే కృష్ణవంశీ గారికి రికమండేషన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే మొదట ఆయనకు నాపై పెద్దగా మంచి అభిప్రాయం లేదు. కానీ తర్వాత నేను ఇచ్చిన ఆడిషన్ చూసిన ఆయన ఆశ్చర్యపోయారు. 'ఏ ఊరు రా నీది? నీ వయసెంత? ఇంత గొప్ప పెర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చావు?' అని అడిగి, వెంటనే సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా నాకు మహాత్మ సినిమాలో నటించే అవకాశం వచ్చింది" అని తాగుబోతు రమేష్ చెప్పుకొచ్చారు.






