చందమామ సినిమా నుంచి నన్ను ఆ కారణంతో తీసేశారు.. షాకింగ్ విషయాలు చెప్పిన అడవి శేష్

by Pulgam srinivas |

చందమామ చిత్రంలో ఒక పాత్ర కోసం తనను ఎంపిక చేసి, కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆయన యాక్టింగ్ స్కిల్స్ నచ్చక ఆ సినిమా నుంచి తనను తొలగించినట్లు అడవి శేష్ స్వయంగా వెల్లడించాడు.

చందమామ సినిమా నుంచి నన్ను ఆ కారణంతో తీసేశారు.. షాకింగ్ విషయాలు చెప్పిన అడవి శేష్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న వారిలో అడవి శేష్ ఒకరు. ఈయన ఎన్నో ప్రయత్నాల అనంతరం సొంతం సినిమాలో ఓ చిన్న పాత్రలో అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత ఈయన 2010లో విడుదలైన కర్మ అనే చిత్రంలో హీరోగా నటించాడు. అయితే ఈ మూవీ ద్వారా కూడా ఈయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఈ మధ్యలో ఆయన సినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా 2007లో వచ్చిన చందమామ సినిమాలో కూడా ఈయనకు ఓ ఆఫర్ వచ్చిందట. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా నటించారు.

ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో అడవి శేష్‌ను కూడా ఎంచుకున్నట్లు, ఆయనపై కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా చేసినట్లు, కానీ ఆ తర్వాత ఆయన యాక్టింగ్ స్కిల్స్ నచ్చక ఆ మూవీ నుండి తీసేసినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఇక 2010లో విడుదలైన కర్మ సినిమా తర్వాత ఈయన అనేక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక క్షణం మూవీతో ఈయనకు హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నటించిన ప్రతి సినిమాతో మంచి విజయాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగాడు. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోగా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

Next Story