నేను దీనికి 'వేసవి అంతా' అని క్యాప్షన్ ఇవ్వాలనుకున్నాను కానీ బెంగళూరులో వర్షం కురుస్తోంది.. ఆషిక రంగనాథ్ పోస్ట్ వైరల్

by I. Sairam |

కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నేను దీనికి వేసవి అంతా అని క్యాప్షన్ ఇవ్వాలనుకున్నాను కానీ బెంగళూరులో వర్షం కురుస్తోంది.. ఆషిక రంగనాథ్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన ‘అమిగోస్’(Amigos) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కింగ్ నాగార్జున(Nagarjuna) సరసన ‘నా సామి రంగా’(Na Saami Ranga) చిత్రంలో నటించింది.

ఈ మూవీలో ఈ భామ, యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక రీసెంట్‌గా కన్నడ స్టార్ హీరో సిద్ధార్థ్(Sidharth) సరసన ‘మిస్ యూ’(Miss You) మూవీలో నటించింది. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తన గ్లామర్ డోస్‌తో అమాంతం కుర్రకారును రెచ్చగొతున్న అషికా తాజాగా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

అందులో ఎల్లో షార్ట్ కలర్ డ్రెస్‌లో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వాటికి.. ‘నేను దీనికి 'వేసవి అంతా' అని క్యాప్షన్ ఇవ్వాలనుకున్నాను కానీ బెంగళూరులో వర్షం కురుస్తోంది.. చివరి చిత్రానికి జారుకుంటే నా భావాలు మీకు అర్థమవుతాయి’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు క్యూటీపై అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story