- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hebba Patel: హైదరాబాద్‌కు మకాం మార్చబోతున్నహెబ్బా పటేల్.. ప్రియుడి కోసమా?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్(Hebba Patel) ‘ఏంజెల్’ సినిమాతో పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్(Hebba Patel) ‘ఏంజెల్’ సినిమాతో పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఆ తర్వాత చేసిన ‘కుమారి 21ఎఫ్’(Kumari 21F) హిట్ కావడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. దీంతో ఏకంగా మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ‘మిస్టర్’ మూవీలో చాన్స్ దక్కించుకుంది. కానీ విజయం సాధించలేకపోయింది. ఓదెల రైల్వే స్టేషన్, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా వంటి మూవీస్ చేసి హిట్స్ సాధించడంతో పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక గత ఏడాది రెండు ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బ్లాక్ బస్టర్ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఓదెల-2’(Odela-2) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇందులో తమన్నా భాటియా(Tamannah Bhatia) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అశోక్ తేజ్(Ashok Tej) దర్శకత్వం వహిస్తున్నారు.
దీనికి సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై మధు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ మొదలెట్టిన మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, హెబ్బా ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. త్వరలో హైదరాబాద్‌లో ఉండబోతున్నట్లు వెల్లడించింది. ‘‘నేను 365 రోజుల్లో 282 ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మిగతా 100 మాత్రమే నా ఇంట్లో నా కుటుంబంతో గడుపుతాను. అందుకే నేను హైదరాబాద్‌లో ఇల్లు కొనుకోవాలనుకుంటున్నాను. ఎక్కువ షూటింగ్స్ ఇక్కడే జరుగుతుండటం వల్ల ఇల్లు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి.. ఇల్లును ఎవరు చూసుకుంటారని ఆలోచిస్తున్నాను. రెస్పాన్సిబుల్ తీసుకోవడానికి ఎవరూ లేరు. అయితే నేను ఇక్కడ అప్ కమింగ్ ఏరియాల్లో అయినా కొనుగోలు చేసి పెడతా’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ప్రియుడి కోసమా అని కామెంట్లు చేస్తున్నారు. అందుకే ఇల్లు కొని అందులో డేటింగ్ చేయబోతుందా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






