నాకు తెలుగులో బాహుబలి లాంటి సినిమా పడాలి.. అదే నా డ్రీమ్.. రామ్ చరణ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-12-19 04:53:49  IST  )

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

నాకు తెలుగులో బాహుబలి లాంటి సినిమా పడాలి.. అదే నా డ్రీమ్.. రామ్ చరణ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), రవితేజ(Raviteja), మహేష్ బాబు(Mahesh Babu) వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లక్ష్యం’, ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధ్రువ’ వంటి సూపర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో నిలిచింది. అయితే ఈ మ‌ధ్య ర‌కుల్‌కి టాలీవుడ్‌లో అవ‌కాశాలు కరువ‌య్యాయి. దీంతో బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి భర్తతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్‌లకు వివిధ సినిమాలలో మేకప్ వేస్తూ వచ్చిన ప్రముఖ మేకప్ మాన్ కడాలి చక్రవర్తి(చక్రి) హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నూతనంగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడమీ” ప్రారంభించడం జరిగింది. గతంలో రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా వంటి ఎందరో స్టార్ హీరోయిన్లకు మేకప్ మెన్‌గా పనిచేసిన చక్రి తానే సొంతంగా ప్రారంభించిన ఈ నూతన మేకప్ స్టూడియోను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన ప్రశ్నలకు రకుల్ ప్రీత్ సింగ్ సమాధానం ఇస్తూ… “ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడం వల్ల నేను తెలుగు సినిమాలను, తెలుగు వారిని ఎంతగానో మిస్ అవుతున్నాను.

తప్పకుండా నేను తెలుగులో సినిమాలు చేస్తాను. నాకు తొలి విజయం అందించింది తెలుగు సినిమానే. నన్ను తెలుగు ప్రజలు అంతగా ఆదరించారు. ఒక చక్కటి కథ కోసం ఎదురుచూస్తున్నాను. నాకు మంచి తెలుగు కథ రావాలని నా అభిమానులంతా నా కోసం ప్రార్థించండి. హైదరాబాద్‌లో ఉండి షూటింగ్ చేయాలని ఎంతో కోరికగా ఉంది. ప్రస్తుతం కథలు వింటున్నాను. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాను. తెలుగులో బాహుబలి వంటి సినిమా చేయాలని నా కోరిక. అదే నా డ్రీమ్ అండ్ డ్రీమ్ రోల్ కూడా” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story