- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాత్రూమ్‌లో కూర్చోని వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని.. బిగ్ బాస్ బ్యూటీ రీతు ఎమోషనల్ కామెంట్స్
బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయిన రీతూ చౌదరి అనంతరం జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయిన రీతూ చౌదరి అనంతరం జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్నది. ఆ తర్వాత ఈ భామ పలు టీవీ షోల్లో కనిపించి బాగానే సందడి చేసింది. ఇక అదే క్రేజ్‌తో బిగ్ బాస్ సీజన్ 9లోనూ పాల్గొంది. అక్కడ డిమోన్ పవన్‌తో ప్రేమాయణం నడిపి చాలా బ్యాడ్ అనిపించుకుంది. మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పినప్పటికీ బయట మాత్రం ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ ఇద్దరి పై ఓ రేంజ్‌లో మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి రకరకాల టీవీ షోలు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలోనే జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్ షోకు గెస్టుగా వచ్చింది ఈ చిన్నది. అక్కడ పలు ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ హౌస్‌లో నాకు ఇష్టమైన కంటెస్టెంట్ డెమోన్. అయితే హౌస్ లోపల ఉన్నప్పుడు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. అయితే, ఫైర్ స్ట్రోమ్ టీమ్ డెమోన్ పవన్‌ను నాకు దూరంగా ఉండమని, రీతూ చెడ్డదని, అతడిని వాడుకుంటోందని చెప్పారు. వాళ్లు అలా చెప్పడం వల్ల నా తల్లి ఎంతో బాధపడ్డారు.
మా అమ్మ లైఫ్‌లో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక కంటెస్టెంట్స్ అందరికీ వాళ్ల బంధువులు కాల్ చేసి విష్ చేస్తారు. బట్ మాకు ఎవరూ లేరు. బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు మా అమ్మ నాకు ఓట్లు వేయాలని మా బంధువులను అడిగినప్పుడు ‘ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్, మేము ఓటు వేయము’ అంటూ చాలామంది అన్నారట. అలాంటి బాధ ఏ ఆడపిల్లకూ రాకూడదు. నేను బయట ధైర్యంగా ఉన్నట్లు కనిపించినా, లోపల వాష్‌రూమ్‌లో కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని’ అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.






