నా తండ్రి అంత్యక్రియలు జరుగుతున్న టైంలో కూడా నేను నవ్వుతూ ఫొటోస్ దిగాను.. సమంత సంచలన కామెంట్స్

by I. Sairam |

సమంత(Samantha) ప్రొడ్యూస్ చేసిన ‘శుభం’(Subham) మూవీ థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

నా తండ్రి అంత్యక్రియలు జరుగుతున్న టైంలో కూడా నేను నవ్వుతూ ఫొటోస్ దిగాను.. సమంత సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సమంత(Samantha) ప్రొడ్యూస్ చేసిన ‘శుభం’(Subham) మూవీ థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. దీంతో ఫుల్ హ్యాపీలో ఉన్న సామ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘అభిమానులు నా దగ్గరకు ఫొటోల కోసం వచ్చినప్పుడు నేను నో చెప్పలేదు. చెన్నైలో నా తండ్రి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనూ అభిమానులు నాతో ఫొటోలు దిగడానికి వచ్చారు.

అప్పుడు అంత బాధలోనూ అభిమానులతో నవ్వుతూ ఫొటోలు దిగాను. ఎందుకంటే అభిమానులు వల్లే నేను ఇంత ఎత్తుకు ఎదిగాను. నా విజయానికి కారణం నా అభిమానులే. మనం ఎలాంటి బాధలో ఉన్నామో వారికి తెలియకపోవచ్చు.. కానీ నాతో ఫొటోలు దిగడానికి వచ్చిన అభిమానులకు నో చెప్పలేదు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

కాగా సమంత నాగ చైతన్య(Naga chaitanya)తో విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) వ్యాధి బారిన పడి దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరం అయిన ఈ ముద్దుగుమ్మ చివరగా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనేవెబ్ సిరీస్‌తో మనముందుకు వచ్చింది. ప్రజెంట్ ‘బ్రహ్మాస్త్రం’ అనే మూవీలో నటిస్తోంది. మరోపక్క నిర్మాతగా మారి చిన్న చిన్న యాక్టర్స్‌ను ప్రోత్సహిస్తుంది.

Next Story