ఈ పూటకు భోజనం చేస్తే చాలు అనుకుంటా.. నాకు రాజకీయాలతో పనిలేదు.. మెగా హీరో ఆసక్తికర కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-02-12 06:25:45  IST  )

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

ఈ పూటకు భోజనం చేస్తే చాలు అనుకుంటా.. నాకు రాజకీయాలతో పనిలేదు.. మెగా హీరో ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. అలాగే భారీ మొత్తంలో అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక గతేడాది ‘విరూపాక్ష’(Virupaksha) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala Yetigattu) సినిమాలో నటిస్తున్నాడు.

ఐశ్వర్య లక్ష్మీ(aishwarya Lakshmi) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి కేపీ రోహిత్(KP Rohit) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో తేజ్ డిఫరెంట్‌లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. అందుకోసం ధరమ్ తేజ్ బాగా కష్టపడుతున్నాడు. నిత్యం జిమ్‌లో కసరత్తులు చేస్తూ వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నాడు. అయితే తాజాగా ఈ హీరో నంద్యాల(Nandyala) జిల్లా ఆళ్లగడ్డ ఎగువ, దిగువ అహోబిలంలో సందడి చేశారు. అక్కడ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం స్వామి వారి గెస్ట్ హౌస్‌లో సెల్ఫీలు, ఫొటోలు ఇచ్చారు.

ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. “నాకు అహోబిల క్షేత్రానికి రావడం చాలా సంతోషంగా ఉంది. స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా, ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ జరుగుతుంది. నాకు రాజకీయాలతో పని లేదు. ప్రస్తుతానికి ఈ పూటకు భోజనం చేస్తే చాలు అనుకుంటా. నలుగురికి సహాయం చేస్తూ, సినిమాలు చేసుకుంటూ, ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంటా. అలాగే ప్రతి హీరో ఫ్యాన్స్‌ను ఒకటే కోరుతున్న డ్రైవింగ్ చేసేటప్పుడు కచ్చితంగా హెల్మెట్(Helmet) ధరించండి. నాకు యాక్సిడెంట్ జరిగిన ఆ రోజు నేను హెల్మెట్ పెట్టుకున్న కాబట్టే ఈ రోజు మీ ముందు ఇలా ఉన్నా” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story