- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను నేను చాలా టార్చర్ పెట్టుకున్నా.. ఆ తప్పు మీరు అస్సలు చేయకండి: తాప్సీ పన్ను
తాను చేసిన తప్పును ఇంకెవరూ చేయొద్దని మహిళలకు ముఖ్యమైన సలహా ఇస్తోంది. చిన్నప్పటి నుంచి తనకు సన్నని నడుము ఉండాలని, అస్సలు పొట్ట కనిపించకూడదని గట్టిగా అనుకునేదట.

దిశ, సినిమా: సినీ పరిశ్రమలో హీరోయిన్లు తాము ఎల్లప్పుడూ నాజుకుగా, ఫిట్‌గా కనిపించాలని ఎంతో కష్టపడుతుంటారు. గ్లామర్ ప్రపంచంలో అందంగా కనిపించడం కోసం కఠినమైన వర్కౌట్లు, కఠినమైన డైటింగ్స్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను కూడా ఒకప్పుడు నాజుకైన నడుము కోసం ఇలాగే ఎంతో కష్టపడి, శరీరాన్నిటార్చర్ పెట్టుకున్నానని.. తాను చేసిన తప్పును ఇంకెవరూ చేయొద్దని మహిళలకు ముఖ్యమైన సలహా ఇస్తోంది. చిన్నప్పటి నుంచి తనకు సన్నని నడుము ఉండాలని, అస్సలు పొట్ట కనిపించకూడదని గట్టిగా అనుకునేదట. అయితే ఆమె నడుము కింది భాగంలో కొద్దిగా కొవ్వు పేరుకుపోయి ఉండేదని, ఆ ఫ్యాట్ ఎందుకు వచ్చిందో అర్థం కాక దాన్ని తగ్గించడం కోసం తన సామర్థ్యానికి మించి విపరీతంగా వ్యాయామాలు చేశానని చెప్పింది. అలా అతిగా వర్కౌట్స్ చేసినప్పుడు తన శరీరం మెదడుకు ఎన్నో హెచ్చరికలు పంపేదని, అయినా తాను వినకుండా శరీరాన్ని చాలా టార్చర్ పెట్టానని ఆవేదన వ్యక్తం చేసింది. చాలా కాలం తర్వాత కానీ తనకు ఒక నిజం ఆలస్యంగా అర్థం కాలేదని తాప్సీ వెల్లడించింది.
ప్రతి మహిళకు భిన్నమైన శరీరం ఉంటుందని, హార్మోన్ల మార్పుల వల్ల బాడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని, దాన్ని మనం సహజంగా అంగీకరించాలని తాప్సీ వివరించింది. ఈ క్రమంలోనే ఒక డాక్టర్ తనకు అసలు విషయాన్ని చెప్పినట్లు పేర్కొంది. మహిళల పొట్ట కింది భాగంలో కొద్దిగా కొవ్వు, నీరు నిల్వ ఉండటం చాలా అవసరమని, అవి లోపల ఉండే గర్భాశయం వంటి ముఖ్యమైన అవయవాలకు రక్షణ కవచంలా పనిచేస్తాయని డాక్టర్ ఆమెకు వివరించారట. కాబట్టి మహిళల్లో లోయర్ బెల్లీ ఫ్యాట్ ఉండటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని తాప్సీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు దిగడం కోసం, ఇతరులను మెప్పించడం కోసం దయచేసి మీ శరీరాన్ని హింసించుకోవద్దని తాప్సీ కోరింది. కొద్దిపాటి కొవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుర్తించాలని.. అవసరానికి మించి అతిగా వర్కౌట్లు చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గడం పక్కన పెడితే, ఒత్తిడి వల్ల అది మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.






