ఆరేళ్ల పాటు అక్కడే ఉన్నా.. తేళ్లు, బొద్దింకలు తిన్నానంటూ టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-02-26 09:30:24  IST  )

టాలీవుడ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఆరేళ్ల పాటు అక్కడే ఉన్నా.. తేళ్లు, బొద్దింకలు తిన్నానంటూ టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చింది. ‘ప్రియురాలు’(Priyuraalu) సినిమాతో వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విరుపాక్ష(Virupaksha), ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, పొలిమేర-2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. మా ఊరి పేరు చిత్రంలో హీరోయిన్‌గా మారిపోయింది.

తన అందం, నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లలో హీట్ పుట్టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘మొదటి నుంచి కూడా నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేదానిని. ఇల్లు - కాలేజ్ తప్ప నాకు మరేమీ తెలియదు. అలాంటి నేను 'చైనా'లో MBBS చేయాలనుకున్నాను. చైనాలో ఇంగ్లిష్ మాట్లాడరని కూడా నాకు తెలియదు. అంత అమాయకంగా నేను అక్కడికి వెళ్లిపోయాను.

అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ల భాషను అర్థం చేసుకోవడానికి .. నేర్చుకోవడానికి ప్రయత్నించాను. చైనాలో ఆరేళ్ల పాటు ఉన్నాను. నాకు అక్కడ గదిలోనే వంట చేసుకుని తినేదాన్ని. అయితే చైనా ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలనే కోరికతో ఒకటి రెండు సార్లు అక్కడి ఆహారం తిన్నాను. బొద్దింకలు, తేళ్లు వంటివి రుచి చూశాను. నేను ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రత్యేకమైన ఐటమ్స్‌ను రుచి చూస్తాను. అందులో భాగంగానే చైనా ఫుట్ తిన్నాను. కొన్నేళ్ల క్రితం చైనాలో మనలాగా గ్రీనరీ ఉండేది కాదని తెలుసుకున్నాను. తినడానికి కూరగాయలు దొరకని సమయంలో ఇలా కనిపించిన జీవుల్ని చంపి తినడం అవటైందట’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కామాక్షి చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అంతా ఆశ్చర్యపోతున్నారు.

Next Story