- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నువ్వు లేకుండా అతి కష్టం మీద ఏడాది గడిపాను.. ఆమెను తలుచుకుని సెంథిల్ ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్(Senthil Kumar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్(Senthil Kumar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన తెలుగు స్టార్ హీరోల సినిమాలకు పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చత్రపతి(Chatrapati), మగధీర, బాహుబలి(Baahubali), ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 2009లో ఆయన రూహిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి జీవితం సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో రూహిని మృతి చెందింది. దీంతో సెంథిల్ శోకసంద్రంలోకి పోయాడు. ఇక ఆమె చనిపోయి ఏడాది పూర్తి కావొస్తున్నా భార్యను మర్చిపోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, సెంథిల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘నువ్వు లేకుండా ఏడాది గడిచింది.. ఈ 365 రోజులు..
నీ నవ్వు, ప్రేమ లేకుండా గడిపాను. కన్నీళ్లు, మర్చిపోలేని జ్ఞాపకాలు, నువ్వు నాతోనే ఉన్నావనే ధైర్యం ఇలా ఎన్నో ఫీలింగ్స్‌తో ఈ ఏడాది గడిచింది. కానీ నీతో ఉన్న చిన్నచిన్న విషయాలు నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటాను.. నన్ను చూసి నువ్వు నవ్వే నవ్వు, నువ్వు నవ్వినప్పుడు నీ కళ్లల్లో వచ్చే మెరుపు, నా చేతిలో పర్ఫెక్ట్‌గా సరిపోయే నీ చేయి ఇవి ఎప్పటికీ గుర్తుంటూనే ఉంటాయి. నువ్వే నా ఛాంపియన్, నా బెస్ట్ ఫ్రెండ్.. నా సర్వశ్వం. నువ్వు పంచిన ప్రేమ, నీ నవ్వు, మనం కలిసి చేసిన పనులు.. ఇవన్నీ నా జీవితాంతం గుర్తు చేసుకుంటాను. రెస్ట్ ఇన్ పీస్ నా డార్లింగ్. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు. లవ్ యూ ఫరెవర్’’ అని రాసుకొచ్చాడు. అలాగే ఆమెతో తీసుకున్న ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం సెంథిల్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆయనను ఓదారుస్తున్నారు.






