నా కెరీర్‌లో మునుపెన్నడూ చేయని పాత్ర ‘వెట్టువం’లో చేశా.. శోభిత ధూళిపాళ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-30 04:33:31  IST  )

నా నమ్మకం ప్రకారం.. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో కెల్లా ‘వెట్టువం’ చాలా ఉత్తమమైనది.

నా కెరీర్‌లో మునుపెన్నడూ చేయని పాత్ర ‘వెట్టువం’లో చేశా.. శోభిత ధూళిపాళ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ రాబట్టుకుంది. మరీ ముఖ్యంగా అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత మరింతగా వార్తల్లో నిలిచింది. పెళ్లికి ముందు తన బోల్డ్ లుక్స్, విభిన్నమైన పాత్రలతో సోషల్ మీడియాను, ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు శోభిత తన సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా గ్రాండ్‌గా స్టార్ట్ చేయబోతోంది. తమిళంలో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామా ‘వెట్టువం’ సినిమాలో ఆమె ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుపుకుంటోంది. ఇందులో తమిళ హీరో ఆర్య విలన్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత ధూళిపాళ ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

"నా నమ్మకం ప్రకారం.. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో కెల్లా ‘వెట్టువం’ చాలా ఉత్తమమైనది. ఇది ఒక అసాధారణమైన కథతో వస్తున్న చిత్రం. ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడు చూస్తారా, అందులో నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారా అని నేను ఎంతో ఆత్రుతగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో నేను ఒక సరికొత్త క్రేజీ అవతారంలో కనిపించబోతున్నాను. నా కెరీర్‌లో మునుపెన్నడూ చేయని విధంగా ఇందులో భారీ యాక్షన్ సీన్స్, అలాగే అద్భుతమైన డ్యాన్స్ కూడా చేశాను. ఇది వివిధ కాలాల (డిఫరెంట్ టైమ్ పీరియడ్స్) నేపథ్యంలో సాగే ఒక అపోకలిప్టిక్ సినిమా కానుంది. కథలో హై డ్రామాతో పాటు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే ఉత్కంఠభరితమైన క్షణాలు చాలా ఉన్నాయి" అని శోభిత ధూళిపాళ చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత శోభిత నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో, ఈ విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రీ పోన్ కానున్న ఆలియా భట్ ‘ఆల్ఫా’?

Next Story