- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రీ పోన్ కానున్న ఆలియా భట్ ‘ఆల్ఫా’?
అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆల్ఫా చిత్రాన్ని జూలై 10న కాకుండా జూలై 3న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఆల్ఫా. ఈ సినిమాలో శర్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ్ రావాల్ దర్శకత్వం వహిస్తున్నారు. కొంతకాలం క్రితం ఈ సినిమాను జూలై 10వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.
ముందుగా ప్రకటించిన తేదీ కంటే వారం ముందుగానే అంటే జూలై 3న సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆల్ఫా నిజంగానే ప్రీ పోన్ అయితే, అది అలియా భట్ అభిమానులతో పాటు యశ్‌రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






