- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sandeep Kishan: ఆ మూవీస్ మిస్ చేసుకుని తప్పు చేశాను.. అందుకే నా సినీ కెరీర్ ఇలా ఉంది
యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) తమిళ, తెలుగు చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు.

దిశ, సినిమా: యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) తమిళ, తెలుగు చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ‘మాజాకా’(Mazaka) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. త్రినాథరావు నక్కిన(Trinadha Rao Nakkina) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments), హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. అయితే ఇందులో రితూ వర్మ(Rithu Verma), రావు రమేష్, అన్షు అంబానీ(Anshu Ambani) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘మాజాకా’ ఫిబ్రవరి 21న విడుదల కాబోతుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన నేను లోకల్(Nenu Local), హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాల్లో మొదట నాకే అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రెండు సినిమాల్లో నటించే చాన్స్ మిస్ చేసుకుని తప్పు చేశాను. దీంతో అవి వేరే హీరోల దగ్గరికి వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒకవేళ ఆ చిత్రాలు నా ఖాతాలో ఉండి ఉంటే నా కెరీర్ ఇంకో లెవెల్‌కి వెళ్లేది. అయినా ఇప్పుడు వస్తున్న అవకాశాలతో సంతోషంగానే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






