నేను ఒక లెక్చరర్‌ని ప్రేమించాను.. అతనితో నేను చాలా టైమ్ పాస్ చేశాను.. రాశి సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-12-09 15:46:56  IST  )

‘శశి’(Shashi) సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన రాశీ సింగ్(Rashi Singh) మనందరికీ సుపరిచితమే.

నేను ఒక లెక్చరర్‌ని ప్రేమించాను.. అతనితో నేను చాలా టైమ్ పాస్ చేశాను.. రాశి సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘శశి’(Shashi) సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన రాశీ సింగ్(Rashi Singh) మనందరికీ సుపరిచితమే. ఈ తర్వాత ‘ప్రేమ్ కుమార్’(Prem Kumar), ‘భూతద్దం భాస్కర్’(Bhuthadham Bhaskar), ‘ప్రసన్న వదనం’(PRasanna Vadanam), ‘బ్లైండ్ స్పాట్’(Blind Spot) లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక రీసెంట్‌గా టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్(Raj Tharun) నటించిన ‘పాంచ్ మినార్‌’(Panch Minar)లో నటించి అలరించింది.

అయితే ఇన్ని సినిమాల్లో నటించిన ఈ చిన్నదానికి మంచి విజయం అయితే తన ఖాతాలో పడలేదు. ప్రస్తుతం రాశీ సింగ్ ‘3 రోజెస్ సీజన్ 2’(3 Roses) వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ ఆహా(Aha)లో స్ట్రీమింగ్ కానుంది. ఇక 3 రోజెస్ సీజన్ 2 ప్రమోషన్స్ లో రాశీ తన కాలేజ్ డేస్‌లో జరిగిన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ' నేను కాలేజ్‌లో చదివే రోజుల్లో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు మా లెక్చరర్. నాకు అన్ని ఫేవర్స్ చేసేవాడు. ఎగ్జామ్ పేపర్లు ముందే ఇచ్చేవాడు. ఇప్పుడు అతనికి పెళ్లయింది.

నన్ను ఇంస్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవుతున్నాడు. వాళ్ళ వైఫ్ కూడా ఫాలో అవుతుంది. ఇక వైవా జరిగే సమయంలో తను ఏమి అడిగేవాడు కాదు. మేము ఎదురెదురుగా కూర్చొని టైమ్ పాస్ చేసేవాళ్లం. కానీ, మా మధ్య ఏమి జరగలేదు. అప్పుడు నా వయస్సు 17 ఏళ్లు.. అతనికి అప్పటికి పెళ్లి కాలేదు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Click For Tweet .....

Next Story