ఆ పని సాయి పల్లవిని చూసే నేర్చుకున్నాను.. నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆ పని సాయి పల్లవిని చూసే నేర్చుకున్నాను.. నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ హీరోగా రాణిస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు అతని ఖాతాలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ పడలేదనే చెప్పాలి. దీంతో ఎలాగైన మంచి హిట్ సాధించాలనే తపనతో రీసెంట్‌గా చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో ‘తండేల్’ (thandel) అనే మూవీతో మనముందుకు వచ్చాడు. సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను.. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు(Bunny Vasu)నిర్మించారు.

ఇక ఈ మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అంతేకాకుండా కలెక్షన్ల విషయంలోనూ భారీ వసూళ్లు సాధిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు మూవీ టీమ్. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య సాయిపల్లవి డ్యాన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘సాధారణంగా నాకు సాయి పల్లవితో డ్యాన్స్ చేయాలంటే ఎక్కడ లేని టెన్షన్ వస్తుంది.

ఓ రకంగా నా డ్యాన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కారణం సాయి పల్లవి అనే చెప్పవచ్చు. ప్రతి సీన్ పూర్తవగానే వెంటనే మానిటర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సీన్ బాగా వచ్చిందో రాలేదో చూసి బాలేకపోతే మరోసారి రీటేక్ చేద్దామంటుంది. ఆమె లాంటి హీరోయిన్‌ను నేనెప్పుడూ చూడలేదు. పల్లవికి వర్క్ పట్ల ఎంతో డెడికేషన్ ఉంది’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగ చైతన్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా సాయి పల్లవి ప్రేమమ్’(Premam) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత ‘ఫిదా’(Fidaa) సినిమాలో నటించి మెప్పించింది. అంతే కాకుండా తన యాక్టింగ్‌తో అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అంతే కాకుండా బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయకపోవడం, మేకప్ వేసుకోకపోవడం వల్ల మరింత ఫేమ్ అయింది. ఇక ఈ భామ డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. అయితే సాయి పల్లవి రీసెంట్‌గా ‘అమరన్’(amaran) మూవీతో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Next Story