- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mrunal Thakur: నీ నుంచి చాలా నేర్చుకున్నాను.. నిన్ను మిస్ అవుతానంటూ మృణాల్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మొదట సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మొదట సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ ఆ తర్వాత ‘సీతారామం’ చిత్రంతో హిట్ సాధించి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇందులో మృణాల్ సంప్రదాయ లుక్స్‌లో కనిపించి తన నటనతో అందరినీ మంత్రముగ్దులను చేసింది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా తెలుగు, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేసిన మృణాల్ పలు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక గత ఏడాది ‘కల్కి’ (Kalki) సినిమాలో కీలక పాత్రలో నటించిన ఆమె మరో హిట్‌ను సాధించింది.
ప్రస్తుతం ఈ అమ్మడు వరుణ్ ధావన్, పూజా హెగ్డే కాంబోలో రాబోతున్న చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. అయితే డేవిడ్ ధావన్(David Dhawan) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మౌనీ రాయ్(Mouni Roy) కూడా నటిస్తోంది. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇక తాజాగా, మృణాల్, మౌనీరాయ్ ఓ ట్రిప్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని తెలుపుతూ మృణాల్ ఓ వీడియోను షేర్ చేసింది. ‘‘నా గ్లాస్గో ట్రిప్‌ను ఇంత అద్భుతంగా చిరస్మరణీయంగా చేసినందుకు ధన్యవాదాలు.
నేను మీ నుండి చాలా నేర్చుకున్నాను మౌనీరాయ్ నేను ఇప్పటికే మిమ్మల్ని మిస్ అవుతున్నాను. దీన్ని మెరుగైన సెటప్, కొరియోగ్రఫీతో చిత్రీకరించలేకపోయినప్పటికీ, ఈ టేక్ అందంగా ఉందని నేను భావిస్తున్నాను. మీరు నాకు నేర్పించడం మాత్రమే కాదు, నా అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీసుకురావడానికి మీరు నాకు సహాయం చేస్తున్నారు. మీ దగ్గర ఉన్నందుకు నేను కృతజ్ఞురాలిని’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు క్యూటెస్ట్ మీ ఫ్రెండ్‌షిప్ చాలా బాగుందని అంటున్నారు.






