- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత్రల కోసం వెంపర్లాడే స్థితి నుంచి ఆ స్థాయికి చేరుకున్నాను.. రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandana) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandana) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ చిన్నది ఫస్ట్ సినిమాతోనే యూత్‌కు క్రష్‌గా మారిపోయింది. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ విజయం సాధించాయి. ఇక ‘యానిమల్’(animal), ‘పుష్ప-1’(Pushpa-1), ‘పుష్ప-2’(Pushpa-2) సినిమాలతో ఈ అమ్మడు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా రీసెంట్‌గా ‘ది గర్ల్‌ఫ్రెండ్’(The Girl Friend) సినిమాతో మంచి విజయం సాధించిన ఈ చిన్నది ప్రజెంట్ ‘కాక్‌టెయిల్’, ‘మైసా’ వంటి సినిమాల్లో నటిస్తోంది.
ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో సీక్రెట్ రిలేషన్‌లో ఉంది. చాలా సార్లు వీరు కెమెరాకు చిక్కడంతో ఈ విషయం కాస్త అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నట్లు సమాచారం. కానీ ఈ జంట మాత్రం దీనిపై అఫీషియల్‌గా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘నటిగా సినిమా సినిమాకీ బాధ్యత పెరుగుతూనే ఉంది. ఇప్పుడు పాత్రల కోసం వెంపర్లాడే స్థితి నుంచి, మంచి పాత్ర కోసం ఆరాటపడే స్థాయికి చేరుకున్నాను. డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేసే రోజులు పోయాయి. ప్రస్తుతం నా కోసం రచయితలు ప్రత్యేకంగా కథలు తయారు చేస్తున్నారు. ఓ విధంగా ఇది నా విజయం. ఫలానా తరహా పాత్రలే చేయాలని అనుకోవడం లేదు. నా కంటే రచయితలనే ఈ విషయంలో ఎక్కువగా నమ్ముతాను. నాకు సూటయ్యే పాత్రలనే వారు నా దగ్గరకు తెస్తారని నా నమ్మకం’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






