శ్మశానంలో ఆరు అడుగుల స్థలం తప్ప నాకు ఇంకేం లేదు.. బుల్లితెర హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-14 02:49:53  IST  )

‘బ్రహ్మముడి’(Brahmamudi) సీరియల్ ఫేమ్ దీపిక రంగరాజు(Deepika Rangaraju) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

శ్మశానంలో ఆరు అడుగుల స్థలం తప్ప నాకు ఇంకేం లేదు.. బుల్లితెర హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బ్రహ్మముడి’(Brahmamudi) సీరియల్ ఫేమ్ దీపిక రంగరాజు(Deepika Rangaraju) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ తమిళ యాక్టర్ అయినప్పటికీ ఈ సిరియల్‌తో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది. దీంతో వరుస షోల్లో కూడా ఆమెను పిలుస్తున్నారు. అలా ఓ పక్క సీరియల్ మరో పక్క టీవీ షోస్‌లతో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. అయితే ఈ చిన్నది ఏదైనా షోకి వస్తే చేసే హంగామా అంతా ఇంతా కాదు. తనకు వచ్చీ రానీ తెలుగుతో ఫుల్ నవ్వించేస్తూ ఉంటుంది. డ్యాన్స్ రాకున్నా పిచ్చి పిచ్చి స్టెప్పులు వేసి పిచ్చి పట్టించేస్తుంటది. అయితే ఆన్ స్క్రీన్ ఇంత జాలీగా ఉండే ఈ చిన్నది రియల్ లైఫ్‌లో తనకు ఉండటానికి ఓ ఇల్లు కూడా లేదని చెప్పడం గమనార్హం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు సొంత ఇల్లు కూడా లేదు. చెన్నైలో ఒక సొంత ఇల్లు ఉండాలని నా కోరిక. నాకు శ్మశానంలో ఒక ఆరు అడుగుల స్థలం ఉంది అంతే, అది తప్ప నాకు ఇంకేం లేవు. నేనేం కోట్లు సంపాదించట్లేదు. లక్షల్లోనే సంపాదిస్తున్నా. ఈ ఫేమ్ అంతా బ్రహ్మముడి సీరియల్ నుంచే వచ్చింది. అంతకుముందు కూడా ఇండస్ట్రీలో ఉన్నా కానీ ఎవరికీ తెలియదు. చెన్నైలో ఒక్కో అపార్ట్మెంట్ కోటి రూపాయల పైనే ఉంది. ఒక్క ఇల్లు అయినా ఉండాలి’ అని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story