నాకు సినిమాలంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు.. కానీ: రాశీ ఖన్నా

by I. Sairam |   (  Updated:2026-01-12 07:22:39  IST  )

యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

నాకు సినిమాలంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు.. కానీ: రాశీ ఖన్నా
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇటీవల ఈ చిన్నది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదామూవీలో నటించి మెప్పించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ ఈ భామ యాక్టింగ్‌కు మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తోంది. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. "నేను సినిమాలు చూస్తూ పెరగలేదు. 'మద్రాస్ కేఫ్' తర్వాత మంచి సినిమాలు రాకపోతే వేరే ఏదైనా పని చేసుకుందాం అనుకున్నాను.

కానీ తెలుగులో మొదటి సినిమా (ఊహలు గుసగుసలాడే)తో లభించిన గుర్తింపు నన్ను నన్ను ఇక్కడే ఉంచేసింది. అంతా నా డెస్టినీ. అయితే చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి అవకాశాలు త్వరగా రావచ్చు కానీ, ప్రతిభ ఉంటేనే నిలదొక్కుకుంటారు. బయటి నుండి వచ్చిన వారు కొంచెం ఎక్కువ కష్టపడాలి. నేను రిజెక్షన్లను చూసి ఎప్పుడూ విక్టిమ్‌లా ఫీలవ్వలేదు. మన తలరాతలో ఉన్నది ఎవరూ తీసుకోలేరు" అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story