Samantha: గత రెండేళ్ల నుంచి దానికి అడిక్ట్ అయిపోయా.. సమంత ఆసక్తికర పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-01-23 11:22:01  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మయోసైటీస్ కారణంగా 2023 నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Samantha: గత రెండేళ్ల నుంచి దానికి అడిక్ట్ అయిపోయా.. సమంత ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మయోసైటీస్ కారణంగా 2023 నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన ఫెల్త్ మీద ఫోకస్ పెట్టిన ఆమె ఫుల్‌గా రెస్ట్ తీసుకుంటోంది. ఇక రకరకాల ట్రీట్‌మెంట్ ట్రై చేసిన తర్వాత మయోసైటీస్ నుంచి కాస్త కోలుకుంది. ఇటీవల ‘సీటాడెల్: హనీ, బన్నీ’(Citadel: Honey Bunny) వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే సామ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. అలాగే యాడ్స్ చేస్తూ చేతినిండా డబ్బు సంపాదిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సమంత ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. గత రెండేళ్ల నుంచి ఓ మంచి అలవాటును ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించింది.

‘‘నేను గత రెండు సంవత్సరాలుగా ఈ చిన్న ఆచారాన్ని పాటిస్తున్నా. ఇది నా కష్టతరమైన క్షణాలలో కొన్నింటి నుంచి బయటపడేలా చేసింది. మొదట ఈ వెల్ నెస్ డైరీ రాయడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అసలు ఏం రాయాలో తెలియకపోయేది. కానీ మెల్లిమెల్లిగా అలవాటైపోయి ఇప్పుడు పూర్తిగా దానికి అడిక్ట్ అయిపోయాను. ప్రతిరోజు వెల్ నెస్ డైరీ రాస్తున్నాను. దీనివల్ల ప్రాక్టీస్ చేయడం, రాయడం మరింత సులభం అవుతుంది. కాబట్టి అందరూ ఈరోజు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను రాయండి.

అవి పెద్దవిగా ఉండవలసిన అవసరం లేదు. కేవలం నిజాయితీగా ఉండాలి. కానీ రాయడం కష్టంగా లేదా బలవంతంగా అనిపిస్తే మీరు విశ్వసించే వారితో చెప్పండి. కొన్నిసార్లు, మీ హృదయంలో ధన్యవాదాలు అని చెప్పుకుంటే కూడా సరిపోతుంది. ఈ అలవాటు మొదట కష్టంగా అనిపించవచ్చు. అయినా మెల్లిగా దానిని అలవాటుగా చేసుకోండి. మనలో చాలా మార్పులు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి. ఇది నాకు గేమ్ ఛేంజర్‌గా మారింది. ట్రై చేస్తే ఎవరి లైఫ్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం’’ అని రాసుకొచ్చింది.

Next Story