- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు ఫోన్ కాల్స్‌తోనే సినిమా ఓకే చేశా.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తమిళ బ్యూటీ అదితి శంకర్(Aditi Shankar).. 2025లో ‘ప్రేమిస్తావా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

దిశ, సినిమా: తమిళ బ్యూటీ అదితి శంకర్(Aditi Shankar).. 2025లో ‘ప్రేమిస్తావా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇప్పుడు ఈ హీరోయిన్ త్వరలో ‘భైరవం’ (Bhairavam)చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీసత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో నటి ప్రియమణి (Priyamani), జయసుధ (Jayasudha) కీలక పాత్రలో నటిస్తుండగా.. అదితి శంకర్‌తో పాటు దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మే 30న వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ అదితి శంకర్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ‘నేను ‘భైరవం’ సినిమాను కేవలం రెండు ఫోన్ కాల్స్‌తో ఓకే చేశాను. ఇక నేను ఫస్ట్ టైమ్ మా డైరెక్టర్‌ను కలిసినప్పుడు నేరుగా లుక్ టెస్ట్ చేశారు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు నా తమిళ మూవీస్ చూసి ఉంటారు. దీంతో చాలా కాన్ఫిడెన్స్‌గా నాకు లుక్ టెస్ట్ చేసి హీరోయిన్‌గా నన్ను ఫిక్స్ చేశారు’ అంటూ చెప్పుకొచ్చింది.






