దానికి అడిక్ట్ అయిపోయా.. చర్చనీయాంశంగా మారిన మృణాల్ ఠాకూర్ కామెంట్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-05 04:23:46  IST  )

అసలు ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తితో కేవలం ఒక ప్రయోగంలా ట్రై చేసిందట. మొదటి ముద్దకే ఫిదా అయిపోయిన మృణాల్.. ఇప్పుడు నిత్యం తింటున్నట్లు చెప్పింది.

దానికి అడిక్ట్ అయిపోయా.. చర్చనీయాంశంగా మారిన మృణాల్ ఠాకూర్ కామెంట్స్!
X

దిశ, సినిమా: బుల్లితెర సీరియల్స్ ద్వారా ఫుల్ ఫేమ్ రాబట్టుకుని ‘సీతారామం’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇందులో సీతగా సాంప్రదాయ లుక్స్‌లో కనిపించిన ఈ భామ చెరగని ముద్దర వేసుకుంది. ఆ తర్వాత నాని సరసన ‘హాయ్ నాన్న’ చిత్రంలో చేయగా.. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారింది. ఇక ది ఫ్యామిలీ మ్యాన్, డెకాయిట్ వంటి మూవీస్ చేసిన మృణాల్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. కేవలం సినిమాలే కాకుండా.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ రాబట్టుకుంటోంది. నిత్యం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనకు నచ్చిన ఫుడ్ కాంబినేషన్స్ గురించి చెప్పి అందరినీ షాక్‌కు గురి చేసింది. బిర్యానీలో థమ్సప్ కలుపుకుని తాగేవాళ్లు, చపాతీని టీ ముంచుకునే వాల్లను చూసాం. కానీ మృణాల్ ఠాకూర్‌కి అలవాటైన ఫుడ్ కాంబినేషన్ గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. వేడివేడి అన్నంలో ఐస్‌క్రీమ్ వేసుకుని తినడం ఆమెకు అత్యంత ఇష్టమైన ఫుడ్ అని అంటోంది. వినడానికి చాలా వింతగా.. అస్సలు ఊహించకోవడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికీ ఈ కాంబినేషన్‌కు ఆమె పూర్తిగా అడిక్ట్ అయిపోయినట్లు చెప్పడం గమనార్హం.

ఇంతకీ ఈ వింత అలవాటు ఎలా మొదలైందో చెప్తూ.. ఒకరోజు ఆమె స్నేహితుడు ఒకరు వేడి అన్నంలో ఐస్‌క్రీమ్ కలుపుకుని చాలా ఇష్టంగా తింటుండటం చూసిన మృణాల్.. అసలు ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తితో కేవలం ఒక ప్రయోగంలా ట్రై చేసిందట. మొదటి ముద్దకే ఫిదా అయిపోయిన మృణాల్.. ఇప్పుడు నిత్యం తింటున్నట్లు చెప్పింది. మొదట్లో సరదాగా ట్రై చేసిన కాంబినేషన్.. ఇప్పుడు లేకుండా ఉండలేనంతగా అడిక్ట్ అయిపోయా అంటోంది. తనకు బాగా ఆకలి వేసినప్పుడు లేదా క్రేవింగ్స్ వచ్చినప్పుడు కచ్చితంగా తింటానని చెప్పింది.. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఏం చేసినా క్యూట్‌గానే ఉంటుందని అభిమానులు అంటుంటే... మరికొందరు మాత్రం బాబోయ్ అన్నంలో ఐస్‌క్రీమా ఇది ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నామని.. సెలబ్రిటీలు ఇలాంటి ప్రయోగాలు కూడా చేస్తారా అని అంటున్నారు. మొత్తానికి నెట్టింట మృణాల్ ఐస్‌క్రీమ్ రైస్ పెద్ద చర్చకు దారితీయగా.. కొందరు ట్రై చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం మృణాల్ ‘హై జవానీతో ఇష్క్ హై హోనా హై’ మూవీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇందులో పూజా హెగ్డే, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించగా.. డేవిడ్ ధావన్ తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story