Sobhita Dhulipala: ఈ విషయాన్ని ప్రకటించడం సంతోషంగా అనిపిస్తుంది.. చాలా ఎక్జైటింగ్‌గా ఉందంటూ అక్కినేని కోడలు పోస్ట్

by Mallepaka Hamsa |

యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) పలు చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Sobhita Dhulipala: ఈ విషయాన్ని ప్రకటించడం సంతోషంగా అనిపిస్తుంది.. చాలా ఎక్జైటింగ్‌గా ఉందంటూ అక్కినేని కోడలు పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) పలు చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా ఆమె బోల్డ్ సీన్స్ చేసి ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక గత ఏడాది ‘మంకీ మ్యాన్’ (Monkey Man)సినిమాతో వచ్చి ఓ అవార్డ్ కూడా అందుకుంది. ఇక శోభిత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. కొద్ది కాలం పాటు ఆమె అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya)తో డేటింగ్ చేసింది. గత ఏడాది వీరిద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. దీంతో శోభిత రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అక్కినేని కోడలు కావడంతో ఓవర్ నైట్ స్టార్‌గా అయిపోయింది. ఇక అప్పటి నుంచి శోభిత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. తన భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అలాగే ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది.

సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న శోభిత పలు పోస్టులు పెడుతోంది. తాజాగా, ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది ‘‘అందం ఎలా ఉంటుందో దాని కంటే ఎక్కువగా ఉంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. @nexxusnewyork కుటుంబంలో చేరడానికి సంతోషిస్తున్నాము. చాలా ఎక్జైటింగ్‌గా ఉంది. ఇది సైన్స్, బలం, ఇంద్రియ లగ్జరీ కలిసి వచ్చే బ్రాండ్. మరమ్మత్తు చేయబడిన, పునరుద్ధరించబడిన, నిస్సందేహంగా ప్రకాశించే జుట్టు ఇక్కడ ఉంది. ట్రిలియన్ ప్రోటీన్ ట్రాన్స్‌ఫ్యూజన్‌తో, మీ జుట్టును తిరిగి వర్జిన్ స్థితికి తీసుకురండి’’ అనే క్యాప్షన్ జత చేసింది.

అలాగే తన కొత్త యాడ్ వీడియోను షేర్ చేసింది. అది చూసిన వారంతా ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తే.. సూపర్ ఉమెన్‌తో పర్‌ఫెక్ట్ యాడ్ అని కామెంట్లు పెడుతున్నారు. అయితే సినిమా అవకాశాలు రాకపోవడం వల్ల ఆమె యాడ్స్ చేస్తున్నట్లు టాక్. కాగా, నాగచైతన్య విషయానికొస్తే.. పెళ్లి తర్వాత ‘తండేల్’ ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ‘NC-24’ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దీనిని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు ‘వృష కర్మ’ అనే పెట్టనున్నట్లు టాక్.

Next Story