- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయంలో చిన్నతనంలోనే చాలా అవమానాలు ఎదుర్కొన్నాను.. యంగ్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్
యంగ్ బ్యూటీ ఇవానా(Ivana) మనందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. ఆతర్వాత హీరోయిన్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ ఇవానా(Ivana) మనందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. ఆతర్వాత హీరోయిన్‌గా మారింది. అలా తమిళ్‌లో ‘లవ్ టుడే’(Love today) సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ డబ్ అయ్యి మంచి హిట్‌గా నిలిచింది. ఇక ఈ మూవీ తర్వాత ఇవానా రీసెంట్‌గా ‘సింగిల్’(Single) చిత్రంలో నటించింది. శ్రీవిష్ణు(Sri Vishnu) హీరోగా నటించిన ఈ మూవీ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ భామ నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో కుర్రకారు క్రష్ అయిపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు నేను హైట్ తక్కువగా ఉండటంతో చాలా అవమానాలు, రిజక్షన్స్ ఎదుర్కొన్నా. స్కూల్‌లో నన్నునా ఫ్రెండ్స్ అందరూ ‘పొట్టి’ అని ఏడిపించేవారు. వాళ్ల మాటలు చాలా బాధపెట్టేవి దాంతో నేను చదువు పై పెద్దగా దృష్టి పెట్టలేక పోయాను. అయితే నాకు చిన్న వయసునుంచే సినిమాల పై ఇంట్రెస్ట్ ఉండేది. దీంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గానే నా కెరీర్ స్టార్ట్ చేశాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇవానా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






