ఆయన డబ్బులు నాకు అవసరం లేదు.. పవన్ కళ్యాణ్ భరణంపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

by Chukka Sudharani |

తన మాజీ భర్త పవన్ కల్యాణ్ నుంచి భరణం కింద డబ్బు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన డబ్బులు నాకు అవసరం లేదు.. పవన్ కళ్యాణ్ భరణంపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: నటి రేణు దేశాయ్ తనపై సోషల్ మీడియాలో జరిగే ట్రోల్సింగ్స్‌పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో మరోసారి ఫైర్ అయింది ఈ నటి. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాలు చేస్తున్న ఈమె.. తన మాజీ భర్త పవన్ కల్యాణ్ నుంచి భరణం కింద డబ్బు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ‘నేను ఎవరి నుంచో డబ్బు తీసుకుంటానని చాలా మంది ఇప్పటికీ అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. నేను డబ్బు కోసం ఎవరి మీద ఆధారపడను. ఒక్క రూపాయి కూడా ఎవరి నుంచి ఆశించను. రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తాను, పెట్టుబడి పెడతాను, అక్కడే బాగా సంపాదిస్తాను. నా డబ్బును నేనే సంపాదిస్తాను, నా పన్నులు నేనే చెల్లిస్తాను’ అంటూ సీరియస్ క్లారిటీ ఇచ్చింది.

Next Story