12 ఏళ్ల క్రితం అలా ఉన్న అతను ఇప్పుడు స్టార్ హీరోగా ఎలా అయ్యాడో అర్థం కావడం లేదు.. రెజీనా షాకింగ్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-02-03 07:41:48  IST  )

హీరోయిన్ రెజీనా కాసాండ్రా(Regina Cassandra) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

12 ఏళ్ల క్రితం అలా ఉన్న అతను ఇప్పుడు స్టార్ హీరోగా ఎలా అయ్యాడో అర్థం కావడం లేదు.. రెజీనా షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: హీరోయిన్ రెజీనా కాసాండ్రా(Regina Cassandra) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘శివ మనసులో శృతి’(Shiva Manasulo Sruthi) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ.. చివరిగా ‘నేనే నా’(Nene Naa) సినిమాలో నటించింది. అయితే నటన పరంగా మంచి మార్కులే సంపాదించుకున్న ఈ అమ్మడుకు స్టార్ స్టేటస్ రాలేదనే చెప్పాలి. ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌(Tollywood)లో అవకాశాలు రావడమే ఆగిపోయాయి. దీంతో బాలీవుడ్(Bollywood), కోలీవుడ్(Kollywood) పై కన్నేసి అక్కడికి చెక్కేసింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ భామ ‘విదాముయార్చి’(Vidamuyarchi) అనే మూవీలో నటిస్తోంది. స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar), హీరోయిన్ త్రిష(Trisha) జంటగా నటిస్తున్న ఈ సినిమాకి మాగిజ్ తిరుమేని(Magij Thirumeni) దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో అర్జున్(Arjun) కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక అర్జున్‌కి జోడిగా రెజీనా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర బృదం ప్రమోషన్ల జోరు పెంచింది. ఈ నేపథ్యంలో రెజీనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా ఇంట్రెస్టింగ్ మాట్లాడుతూ.. ‘శివ కార్తికేయన్ (Sivakarthikeyan) ఇంత పెద్ద హీరో అవుతాడు అనుకోలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను శివ కార్తికేయన్ ‘కేడి బిల్లా కిల్లాడి రంగా’ అనే మూవీలో కలిసి యాక్ట్ చేశాము. ఈ చిత్రం రిలీజ్ అయి 12 ఏళ్లు అవుతుంది.

అయితే, ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పడు కూడా అలాగే ఉన్నారు. ఆయనలో ఏ మార్పూ లేదు. అలాంటిది శివకార్తికేయన్ ఇంత పెద్ద హీరో ఎలా అయ్యారో, ఏం చేశారో నాకు తెలీదు. సినీ రంగంలో ఇది చాలా కష్టం. ఆయనతో నటించేటప్పుడు ఇంత పెద్ద హీరో అవుతారని నేను అనుకోలేదు. నటుడిగా ఆయన వేరు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మనిషి ఒకేలా ఉన్నాడు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రెజీనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story