- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో ఉండే పోటీ గురించి నేను అస్సలు ఆలోచించను.. ఇక్కడ ఎవరి ప్రత్యేకత వారిదే : నభా నటేష్
ఈ ఎండాకాలం నాకు ఎంతో ప్రత్యేకమైనది. నేను ఎంతో ఇష్టపడి చేసిన ‘నాగబంధం’, ‘స్వయంభు’ చిత్రాలు రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నభా నటేష్ ప్రస్తుతం వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న భారీ ప్రాజెక్ట్‌లు నాగబంధం, స్వయంభు చిత్రాలు షూటింగ్ పనులను శరవేగంగా ముగించుకుంటున్నాయి. నాగబంధం జూలై 3న రాబోతుండగా.. స్వయంభు ఆగస్టులో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నభా నటేష్ తన కెరీర్, సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. "ఈ ఎండాకాలం నాకు ఎంతో ప్రత్యేకమైనది. నేను ఎంతో ఇష్టపడి చేసిన ‘నాగబంధం’, ‘స్వయంభు’ చిత్రాలు రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి. ‘నాగబంధం’ సినిమాలో నేను ‘పార్వతి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా.. ‘స్వయంభు’ చిత్రంలో ‘సుందరవల్లి’ అనే సాంప్రదాయబద్ధమైన క్లాసికల్ డ్యాన్సర్ పాత్రలో కనిపించబోతున్నాను" అని తన క్యారెక్టర్ల గురించి వివరించారు.
సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం, పోటీ గురించి నభా తనదైన శైలిలో స్పందించారు. ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు గుర్తిస్తారనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని ఆమె కొట్టిపారేశారు. సంఖ్య కంటే క్వాలిటీ ముఖ్యమని, ఒక మంచి సినిమా చేస్తేనే ప్రేక్షకుల గుండెల్లో ఎక్కువ కాలం ఆదరణ ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇండస్ట్రీలో ఉండే పోటీ గురించి తాను అస్సలు ఆలోచించనని, ఇక్కడ ఎవరి ప్రత్యేకత వారిదేనని స్పష్టం చేశారు. సినిమా హిట్ లేదా ఫ్లాప్ అవుతుందా అనే విషయం పక్కన పెడితే.. నటిగా తన పాత్రకు తాను ఎంతవరకు న్యాయం చేశానా లేదా అన్నదే తనకు అత్యంత ముఖ్యమైన విషయమని నభా చెప్పుకొచ్చారు. ఇక సోషల్ మీడియా వాడకంపై కూడా నభా నటేష్ క్లారిటీ ఇచ్చారు. తనకు వీలైనంత ఎక్కువ సమయం అభిమానులతో గడపాలన్నదే తన పాలసీ అని, అందుకే సోషల్ మీడియా ద్వారా నిరంతరం వారితో టచ్‌లో ఉంటానని చెప్పారు.






