Balakrishna: ఆదివారం ఆ పని మాత్రం అస్సలు చేయను.. బాలయ్య షాకింగ్ కామెంట్స్ (వీడియో)

by Mallepaka Hamsa |

బాలకృష్ణ(Balakrishna), బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj).

Balakrishna: ఆదివారం ఆ పని మాత్రం అస్సలు చేయను.. బాలయ్య షాకింగ్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: బాలకృష్ణ(Balakrishna), బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj). ఇందులో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara Entertainments) బ్యానర్‌పై నాగవంశీ(Naga Vamsi) నిర్మించారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మొదటి రోజు నుంచి హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ రికార్డు బద్దలు కొడుతోంది.

ఈ క్రమంలో.. తాజాగా, ‘డాకు మహారాజ్’ మూవీ టీమ్‌ను యాంకర్ సుమ ఇంటర్వ్యూలో చేసింది.బాలకృష్ణ(Balakrishna), బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj).ఇందులో భాగంగా బాలయ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నిజ జీవితంలో ఓ సెంటిమెంట్ ఫాలో అవుతాను. ఆదివారం రోజు నలుపు రంగు బట్టలు అస్సలు ధరించను. ఆదివారం అంటే నాకు బ్లాక్ డేంజర్. ఒకవేళ అలా జరగదని వేసుకుంటే మాత్రం నాకు చాలా ప్రమాదం. నాది మూలా నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో దానినే పాటిస్తున్నా. ప్రత్యాది దేవతలు ఉంటారనేది నమ్ముతాను. అందుకే ఆదివారం నలుపు ధరించను.

అయితే ఓ సారి మాత్రం ‘ఆదిత్య 369’(Aditya 369) సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ కోసం నలుపు వేసుకోవాల్సి వచ్చింది. ఏదో నష్టం జరగబోతుందని గ్రహించి ఆ కలర్ వద్దు అని ముందే చెప్పినా వినలేదు. అదే రోజు బాలసుబ్రమణ్యం కూడా సెట్‌కి వచ్చారు. అయితే అప్పుడు ఆయన కళ్ల ముందే కిందపడిపోవడంతో నడుము విరిగింది. ఆయన రావడం వల్లే అలా జరిగిందనుకుని మళ్లీ షూటింగ్‌లోకి రాలేదు పాపం. చాలా కంగారు పడిపోయారు. అందుకే అప్పటి నుంచి ఆదివారం నలుపు జోలికి పోను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా ఇలాంటివి పాటిస్తారా అని అంటున్నారు.

Next Story