‘గేమ్ ఛేంజర్’ సినిమా నాకే నచ్చలేదు.. కానీ రాజీ పడాల్సి వచ్చింది.. డైరెక్టర్ శంకర్ సెన్సేషనల్ కామెంట్స్

by I. Sairam |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబోలో వచ్చిన తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’(Game Changer).

‘గేమ్ ఛేంజర్’ సినిమా నాకే నచ్చలేదు.. కానీ రాజీ పడాల్సి వచ్చింది.. డైరెక్టర్ శంకర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబోలో వచ్చిన తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’(Game Changer). దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీలో కియారా అద్వాని(Kiara Adwani) హీరోయిన్‌గా నటించింది. అలాగే అంజలి(Anjali), సునీల్(Sunil), సముద్ర ఖని(Samudrakani), ఎస్ జె సూర్య(SJ Surya) కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా రిలీజైన 24 గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్‌తో పైరసీ రూపంలో దర్శనమిచ్చింది. అయితే సినిమాకు ముందు హైప్ పెంచేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో డైరెక్టర్ శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ మాట్లాడుతూ.. ‘గేమ్ ఛేంజర్ అవుట్‌పుట్‌తో నేను హ్యాపీగా లేను. నేను అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా నిడివి 5 గంటల వరకు ఉండాలి. సమయాభావం వల్ల కొన్ని సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది. దీంతో కథ అనుకున్న విధంగా రాలేదు. చెప్పాలంటే అసలు నాలాంటి డైరెక్టర్ ఇలాంటి విషయాల్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో నేను రాజీ పడాల్సి వచ్చింది. అలా కాకుండా ఉండి ఉంటే నేను ఈ చిత్రాన్ని ఇంకా బాగా తీసేవాడిని’ అని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ శంకర్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story