సౌత్ సినిమాల్లో హీరోయిన్లను అలా చూడటం నాకు అస్సలు నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-23 11:52:50  IST  )

సౌత్ సినిమా ఇండస్ట్రీపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లను చూసే విధానం తనకు అంతగా నచ్చలేదని చాలా ఓపెన్‌గా చెప్పారు.

సౌత్ సినిమాల్లో హీరోయిన్లను అలా చూడటం నాకు అస్సలు నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అంతేకాకుండా ఐటమ్ సాంగ్స్‌లోనూ మాస్ స్టెప్పులు వేస్తూ.. బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు. తమన్నా ఇటీవల ఓ రొమియో, ఒదెల-2 వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. తమన్నా ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘వ్యాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని దీపక్ కుమార్ మిశ్రా తెరకెక్కిస్తుండగా.. బాలాజీ టెలిఫిల్మ్స్ నిర్మిస్తోంది. సునీల్ గ్రోవర్, శ్వేతా తివారీ ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2026 ఆగస్టు 26న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా సౌత్ సినిమా ఇండస్ట్రీపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లను చూసే విధానం తనకు అంతగా నచ్చలేదని చాలా ఓపెన్‌గా చెప్పారు.

సౌత్ ఇండస్ట్రీలో కొంత పురుషాధిక్యత ఎక్కువగా కనిపిస్తుందని, హీరోయిన్లను గౌరవంగా చూపించే విషయంలో కొంత లోటు ఉంటుందని తన మనసులోని మాటను పంచుకున్నారు. భారతీయ సినిమాల్లో పాటలు, డ్యాన్సులకు చాలా ప్రాధాన్యత ఉంటుందని.. ఆ విషయాన్ని తాను కెరీర్ మొదట్లోనే అర్థం చేసుకున్నానని తమన్నా తెలిపారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే కేవలం యాక్టింగ్ మాత్రమే చేసే హీరోయిన్లు కొందరైతే.. గ్లామర్ పాత్రలు చేసేవాళ్లు మరికొందరు ఉంటారని అన్నారు. అయితే గ్లామర్ చూపిస్తూనే, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చేయగలిగిన వారే ఇండస్ట్రీలో సూపర్ స్టార్లుగా ఎదుగుతారని పేర్కొన్నారు. అలాగే సౌత్ ఇండస్ట్రీలో కూడా 10 నుండి 15 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్లుగా నిలదొక్కుకున్న వాళ్లంతా.. ఈ రెండు విషయాలను బ్యాలెన్స్ చేసినవారేనని తమన్నా చెప్పుకొచ్చారు.

Next Story