ప్రభాస్‌తో ఆ పని చేయడానికి నాకు అవకాశం రాలేదు.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ప్రభాస్‌తో ఆ పని చేయడానికి నాకు అవకాశం రాలేదు.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది.. ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇక అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడి అతన్నే మ్యారేజ్ చేసుకున్న ఈ బ్యూటీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత రీసెంట్‌గా బాలీవుడ్ దర్శకుడు రాజ్‌ నిడిమోరు(Raj Nidimoru)తో పెళ్లిపీటలెక్కింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో యోగా ఆశ్రమంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది.

ఇక మ్యారేజ్ తర్వాత మళ్లీ తమ ప్రొఫెషనల్ వర్క్స్‌లో బిజీ అయిపోయింది సమంత. ‘శుభం’(Shubham) సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకున్న సామ్ ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు కూడా సామ్‌నే నిర్మాతగా వ్యవహరిస్తోంది. దీనికి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య, దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి రిలీజ్ అయన టీజర్ సినిమాపై హైప్ పెంచేసింది. సాఫ్ట్‌గా ఉండే సామ్ ఈ మూవీలో ఫైటింగ్ చేస్తూ అదుర్స్ అనిపించింది. ఈ క్రమంలో సమంత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ లాంచ్ చేయడానికి వెళ్లిన సామ్‌ను బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ మీరు మా కోసం వచ్చారా ఇంకా మేము షాక్‌లోనే ఉన్నాము అని అంటుంది. అప్పుడు సమంత నాకు ప్రభాస్‌తో నటించే అవకాశం రాలేదు. అందుకే సినిమా లాంచ్ కోసం వచ్చాను. రెబల్ స్టార్.. రాజా సాబ్ అంటూ నవ్వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story