- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన వల్లే జాకెట్ వేసుకోకుండా సినిమా మొత్తం చేశాను.. ‘షష్టిపూర్తి’ నటి షాకింగ్ కామెంట్స్ (వీడియో)
సీనియర్ నటి అర్చన(Archana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె 1982లో ‘నిరీక్షణ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, సినిమా: సీనియర్ నటి అర్చన(Archana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె 1982లో ‘నిరీక్షణ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు అర్చనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసింది. ఇక ఇందులో జాకెట్ ధరించకుండా నటించిన ఆమె అప్పట్లో సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఈ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే కొద్ది కాలంపాటు సినిమాలకు దూరం అయింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ‘షష్టిపూర్తి’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad), రూపేష్, ఆకాంక్ష సింగ్(Akanksha Singh) ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా.. మే 30న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న అర్చన షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘‘నిరీక్షణ సినిమాలో గిరిజన యువతిగా నటించడం పెద్ద సవాళ్లుగా అనిపించింది. ఆ రోజుల్లోనే బ్లౌజ్ లేకుండా మూవీ మొత్తం నటిస్తున్నాని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. నేను నా దర్శకుడిని నమ్మాను.ఆయన చేసిన చిత్రాల గురించి తెలుసుకున్నాను. ఏ సినిమాలోనూ అశ్లీతతతో గ్రామర్‌ను చూపించలేదు. అందుకే ‘నిరీక్షణ’లో నటించా. అదొక పెద్ద సవాళ్లు అయినప్పటికీ నా జీవితంలోనే ప్రత్యేకమైనదిగా నిలిచింది. డైరెక్టర్‌పై నమ్మకంతో చేశాను. అనుకున్నట్లుగానే ఆయన చాలా పవిత్రంగానే ఆ పాత్రను ప్రేక్షకులకు చూపించారు. అయితే ఈ సినిమా నాకు ఒక అన్నయ్యను (భాను చందర్) ఇచ్చింది. ఆ బంధం ఇప్పటికీ ఉంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.






