ఎన్టీఆర్ విష‌యంలో నేను ఆ వెద‌వ ప‌ని చేశాను.. దీంతో నన్ను త‌రిమి త‌రిమి కొట్టారు.. మంచు మ‌నోజ్ షాకింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

మంచు మోహ‌న్ బాబు(Mohan Babu) త‌న‌యుడు, టాలీవుడ్ హీరో మ‌నోజ్(Manoj) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఎన్టీఆర్ విష‌యంలో నేను ఆ వెద‌వ ప‌ని చేశాను.. దీంతో నన్ను త‌రిమి త‌రిమి కొట్టారు.. మంచు మ‌నోజ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు మోహ‌న్ బాబు(Mohan Babu) త‌న‌యుడు, టాలీవుడ్ హీరో మ‌నోజ్(Manoj) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కెరీయర్‌లో మంచిమంచి సినిమాలు చేసిన మ‌నోజ్ ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ఇక ఆయన చాలా రోజుల త‌ర్వాత ‘భైరవం’(bhairavam) మూవీతో కం బ్యాక్ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే మనోజ్ లైనప్ లోనూ వరుస చిత్రాలు ఉండటంతో రానున్న రోజుల‌లో ప్రేక్షకుల‌ని ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నారు. అయితే భైర‌వం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఎన్టీఆర్‌(NTR)పై మ‌నోజ్ ప‌లు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ‘మా చిన్న‌త‌నంలో నేను చేసిన వెధవపని వల్ల ఎన్టీఆర్ బాగా ఏడ్చాడు. చిన్న తనంలో మేము ఐదో, ఆరో తరగతి చదువుతున్నాం.. ఓ పెళ్ళికి వెళ్ళాం. అప్పుడు ఒక బెలూన్‌ను తీసుకొచ్చి.. దానికి మంట పెట్టాను.. ఆ మంట కాస్త ఎన్టీఆర్ చేతికి అంటుకుంది. దీంతో ఎన్టీఆర్ బోరున ఏడ్చేశాడు. ఎన్టీఆర్ ఏడుపు చూసి మా అమ్మమ్మ వచ్చి న‌న్ను చిత‌క్కొట్టింది. మా అమ్మమ్మ ఆదిలక్షమ్మ.. బిడ్డను చంపేస్తావా అంటూ తరిమి తరిమి కొట్టింది’ అని మ‌నోజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story