- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
9వ క్లాస్‌లోనే ఆ పని చేశా.. కానీ తర్వాత నేను అతనికి బోర్ కొట్టేశాను.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss) వల్ల ఇప్పటికే చాలా మంది ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss) వల్ల ఇప్పటికే చాలా మంది ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో అరియానా(Ariana) ఒకరు. ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ టాలీవుడ్ బుల్లితెరపై సత్తా చాటుతోంది. అలా టీవీ షోస్, ఓటీటీ షోలతో బిజీగా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ తన బ్రేకప్ స్టోరీని అందరితో పంచుకుంది. ‘ నేను తొమ్మిదో తరగతి చదువుకుంటున్నప్పడే లవ్‌లో పడ్డాను. అతను అప్పుడు విజయవాడలో ఉండేవాడు. నేను తాండూరులో ఉండేదాన్ని.
ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటి నుంచి హైదరాబాద్‌కు వచ్చాను. అప్పుడే మా బావకు కూడా జాబ్ వచ్చింది. దీంతో ఇద్దరం కలిసి ఒకే రూమ్ తీసుకుని మూడేళ్లు కలిసి ఉన్నాం. ఇద్దరం చాలా డీప్‌గా కనెక్ట్ అయిపోయాను. అయితే ఆ తర్వాత తనకు నేను బోర్ కొట్టేశానేమో. ఓ రోజు చూడకూడనిది చూశాను. అప్పుడే నా గుండెలు బద్దలైపోయాయి. ఆ తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉన్నాం. మళ్లీ అతను రిక్వెస్ట్ చేస్తే ఇంకో రెండేళ్లు కలిసి ఉన్నాం. అప్పుడే నాకు ఆర్జే కావాలని ఉందని మనసులో మాట చెప్పాను.
తను కూడా ఒప్పుకుంటే ఓ ప్రాక్టీస్ కోర్సులో చేరాను. అప్పుడు నాకు ఓ అబ్బాయి పరిచయం అయ్యాడు. అది మా బావకు అసలు నచ్చలేదు. నాపై అనుమానం పెంచుకున్నాడు. కావాలనే నన్ను టార్చర్ చేశాడు. ఆ అబ్బాయితో నాకు ఎలాంటి రిలేషన్ లేదు. కానీ మా బావ నన్ను అపార్థం చేసుకున్నాడు. దీంతో ఇద్దరం విడిపోయాం. ఇప్పటికీ అతను నాకు గుర్తుకు వస్తుంటాడు. మా నాన్న లేకపోవడంతో అతని కేరింగ్ కు అడిక్ట్ అయిపోయాను’ అంటూ ఎమోషనల్ అయ్యిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అరియానా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






