ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశా.. మాస్ జాతరపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశా.. మాస్ జాతరపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అయింది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ కాగా.. ఈ హైప్ మరింత పెంచేశాడు డైరెక్టర్ భాను భోగవరపు. ‘ఇది కల్పిత కథే. అయితే ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాల గురించి, వారు ఎదుర్కొన్న సంఘటల గురించి తెలుసుకున్నాను. వాటి స్ఫూర్తితో ఈ కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం జరిగింది. ఇందులో మాస్ అంశాలు ఉంటాయి. అదే సమయంలో ఒక కొత్త పాయింట్ కూడా ఉంటుంది. రైల్వే పోలీస్ నేపథ్యంలో జరిగే ఈ కథలో క్రైమ్ సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. రవితేజనే 'మాస్ జాతర' టైటిల్ చెప్పారు. కథ విన్న తర్వాత వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయి అంటూ ఆయన ఈ టైటిల్ సూచించారు. ఆ టైటిల్ తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. మాస్ అంశాలు మరిన్ని జోడించాను. థియేటర్‌లో ప్రేక్షకులు కొన్ని సర్‌ప్రైజ్‌లు చూడబోతున్నారు’ అంటూ తెలిపారు భాను.

Next Story