ఆ ఇద్దరితో కలిసి నటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.. ప్రియాంక మోహన్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

నేను ఎప్పటి నుంచో ప్రేక్షకులకి ప్రకటించాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం ఇది.

ఆ ఇద్దరితో కలిసి నటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.. ప్రియాంక మోహన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ టాలీవుడ్, కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ప్రియాంక కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఆమె చేతిలో అరసన్, 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్స్ వంటి పలు భారీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇవి షూటింగ్ దశలో ఉండగా.. నటిగా ఆమె ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పుడు వీటితో పాటు కోలీవుడ్‌లో మోస్ట్ ఎవైటెడ్ చిత్రంగా మారిన మారి సెల్వరాజ్ ‘మంజనాథి’ ప్రాజెక్ట్‌కు కూడా ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటిస్తూ ప్రియాంక ఎమోషనల్ అయింది.

"నేను ఎప్పటి నుంచో ప్రేక్షకులకి ప్రకటించాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం ఇది. మారి సెల్వరాజ్, ఇళయరాజా గారి లాంటి గొప్ప సాంకేతిక నిపుణుల టీమ్‌తో కలిసి పని చేయడం నిజంగా నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ సరికొత్త ప్రయాణం, కొత్త ప్రారంభం పట్ల నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను" అని రాసుకొచ్చింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ప్రియాంక మోహన్‌తో పాటు కాయదు లోహర్,ధృవ్ విక్రమ్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Next Story