‘రామాయణ’లో నేను భాగమవ్వడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను.. రణబీర్ కపూర్ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

సినిమాలో నటించాలనే నిర్ణయం నా కెరీర్‌ను మలుపు తిప్పుతుందని నేను మొదట అనుకోలేదు, కానీ ఇది ఖచ్చితంగా నా జీవితాన్నే మార్చేసింది.

‘రామాయణ’లో నేను భాగమవ్వడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను.. రణబీర్ కపూర్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్నారు. అలాగే రావణాసురుడిగా కన్నడ స్టార్ యష్, మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్, హనుమంతుడిగా సంజయ్ దత్ నటిస్తున్నారు. నమీత్ మల్హోత్రాతో కలిసి హీరో యష్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ ఈ సినిమా గురించి, శ్రీరాముడి పాత్ర తన జీవితాన్ని ఎలా మార్చేసిందో చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. "ఈ సినిమాలో నటించాలనే నిర్ణయం నా కెరీర్‌ను మలుపు తిప్పుతుందని నేను మొదట అనుకోలేదు, కానీ ఇది ఖచ్చితంగా నా జీవితాన్నే మార్చేసింది. రామాయణాన్ని, శ్రీరాముని పవిత్రమైన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సినిమా నాకు ఎంతో సహాయపడింది.

దీనివల్ల నా జీవితంలో ఎన్నో మంచి మార్పులు వచ్చాయి" అని రణబీర్ చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. "ఈ సినిమా వల్ల నాకున్న కొన్ని చెడు అలవాట్లు మారిపోయాయి. జీవితాన్ని, త్యాగాన్ని, ధర్మాన్ని చూసే నా కోణం పూర్తిగా మారిపోయింది. నా జీవితంలో నాకు నిజంగా ఇలాంటి మార్పు అవసరమైన సమయంలోనే ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి వచ్చింది. నా కూతురు ‘రాహా’ పుట్టిన తర్వాత నేను ఒక మంచి వ్యక్తిగా మారాను. ఆ రాహా కోసమే నన్ను మరింత మంచి వ్యక్తిగా మార్చడానికి ఈ ‘రామాయణ’ సినిమా నా జీవితంలోకి వచ్చింది. మన సంస్కృతి, చరిత్ర ఆధారంగా ఇంతటి భారీ మూవీ వస్తున్నప్పుడు, అందులో నేను భాగమవ్వడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. దీనికి నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను" అని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చారు. రణబీర్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఈ ప్రతిష్టాత్మక సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

Next Story