అలాంటి సినిమాలను ఎంచుకుంటా.. రీతికా నాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

‘అశోక వనంలో అర్జున కళ్యాణం’(Ashoka Vanamlo Arjuna Kalyanam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ రీతికా నాయక్(Rithika Nayak) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

అలాంటి సినిమాలను ఎంచుకుంటా.. రీతికా నాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’(Ashoka Vanamlo Arjuna Kalyanam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ రీతికా నాయక్(Rithika Nayak) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘హాయ్ నాన్న(Hai Nanna), ‘మిరాయ్’(Mirai) వంటి చిత్రాలతో మంచి హిట్ సాధించింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రజెంట్ మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ‘కొరియన్ కనకరాజు’(Korean Konakaraju) మూవీలో యాక్ట్ చేస్తోంది.

మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సమ్మర్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను సినిమాల విషయంలో ఎక్కువగా చూసేది కంటెంట్. అందుకే కంటెంట్ బాగుంటే వెంటనే ఓకే చెప్తాను. ప్రజెంట్ రెండు సినిమాలు చేస్తున్నాను. అవి కూడా అలా ఎంచుకున్నవే’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story