Ravi Teja: వారి ప్రేమను ఎంత ఆశీర్వాదంగా భావిస్తున్నానో మాటల్లో చెప్పలేను.. రవితేజ భావోద్వేగ పోస్ట్

by Mallepaka Hamsa |

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ప్రస్తుతం ‘మాస్ జాతర’(Mass Jatara ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Ravi Teja: వారి ప్రేమను ఎంత ఆశీర్వాదంగా భావిస్తున్నానో మాటల్లో చెప్పలేను.. రవితేజ భావోద్వేగ పోస్ట్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ప్రస్తుతం ‘మాస్ జాతర’(Mass Jatara ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంను శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సైజన్య నిర్మిస్తున్నారు. దీనికి బలగం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. జనవరి 26న రవితేజ బర్త్ డే జరుపుకున్న విషయం తెలిసిందే. ఆయనకు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు విషెస్ తెలుపుతూ పోస్టులు పెట్టారు. తాజాగా, ఈ విషయం రవితేజ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మీ ప్రేమ, దీవెనలు అందుకోవడం నిజంగా ఎంత ఆశీర్వాదంగా భావిస్తున్నానో మాటల్లో చెప్పలేను. మీ హృదయపూర్వక శుభాకాంక్షలు నాకు ప్రపంచాన్ని సూచిస్తాయి. మీలో ప్రతి ఒక్కరినీ నేను ఎంతో ఆరాధిస్తాను. నా ప్రియమైన తమ్ముళ్లు, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు.

Next Story