నేను రోజు వాళ్లకి ఫోన్ చేసి రాత్రికి రమ్మని చెబుతాను.. బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2026-01-03 04:28:09  IST  )

‘జబర్దస్త్’(Jabardasth) లాంటి కామెడీ షో ద్వారా చాలా మంది నటులు పరిచయం అయ్యారు.

నేను రోజు వాళ్లకి ఫోన్ చేసి రాత్రికి రమ్మని చెబుతాను.. బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘జబర్దస్త్’(Jabardasth) లాంటి కామెడీ షో ద్వారా చాలా మంది నటులు పరిచయం అయ్యారు. అలా లేడీ గెటప్స్ ద్వారా కూడా చాలా మంది పాపులర్ అయ్యారు. వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్ ద్వారా పాపులర్ అయిన ప్రియాంక సింగ్.. తర్వాత అబ్బాయి నుంచి పూర్తిగా అమ్మాయిలా మారిపోయింది. ఇక ఈ చిన్నదానికి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే చాన్స్ కూడా వచ్చింది. దీంతో అక్కడ కూడా తన గేమ్, మంచి తనంతో ప్రేక్షకులను అలరించింది.

అయితే మానస్‌ని ఇష్టపడటం అతనికి ఇష్టం లేకున్నా అతని వెంట పడటం కొంచెం మైనస్ అయింది. ఇక హౌస్ నుంచి బయటికి వచ్చాక తన పర్సనల్ లైఫ్‌తో బిజీగా ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఉండేది 3BHK.. కానీ ఇంట్లో నా తప్ప ఇంకెవరు ఉండరు. నాతో మాట్లాడటానికి కూడా ఎవరూ లేరు. మా ఇంటికి మనుషులు కూడా ఎవరూ రారు. మార్నింగ్ పని చేసే ఆమె వస్తది పని అయిపోయాక వెళ్లిపోతుంది. ఈవెన్ నాకు ఒక్కదానికే వంట చేసుకొని కూడా తినబుద్ధి కాదు.

అందుకే నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఈ రోజు ఖాళీగా ఉన్నావా.. ప్లానింగ్స్ ఏంటి నేను నీకు ఇష్టమైన ఫుడ్ చేసి పెడతాను రాత్రికి ఇంటికి రావచ్చుగా.. డిన్నర్ చేద్దాం కదా అని రోజూ రిక్వెస్ట్ చేస్తాను. కావాలంటే నా ఫోన్ ఇప్పుడు చెక్ చేసినా కూడా ఇద్దరు ముగ్గురికి మెసేజ్ పెట్టి ఉంటా.. ఒసేయ్ నైట్ ఫ్రీ ఉన్నావా ఇంటికి వస్తావా, తిందామా అని.. అలా అయిపోయింది నా లైఫ్.. బట్ నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఎవరితో కాంట్రవర్సీ లేవు. ఎవరైనా నన్ను ఏమైనా అనుకున్నా సరే నేను వాళ్లకు ఆన్సర్ కూడా చేయను. ఎందుకంటే ప్రతి దానికి సమయం వస్తుంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story