నాలుగు కార్లు కొన్నాను... కానీ ఇల్లు మాత్రం లేదు.. షాకింగ్ నిజాలు వెల్లడించిన సుమంత్ ప్రభాస్

by Pulgam srinivas |

టాలీవుడ్ యువ నటుడు సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ, “మా నాన్నగారి ఆనందం కోసమే నేను నాలుగు కార్లు కొన్నాను” అని వెల్లడించాడు.

నాలుగు కార్లు కొన్నాను... కానీ ఇల్లు మాత్రం లేదు.. షాకింగ్ నిజాలు వెల్లడించిన సుమంత్ ప్రభాస్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు సుమంత్ ప్రభాస్ తాజాగా గోదారి గట్టుపైన సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని మే 8న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అయ్యారు. సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ... “కొంతకాలం క్రితం నేను నాలుగు కార్లు కొన్నాను అని చెప్పాను. దానికి చాలామంది మిడిల్ క్లాస్ యువకుల కల అదే అని స్పందించగా, మరికొందరు ఎందుకు చెప్పావు అని ప్రశ్నించారు” అని తెలిపారు. అయితే ఆ విషయం చెప్పడానికి ప్రధాన కారణం తన తండ్రి ఆనందమేనని ఆయన వెల్లడించారు.

చిన్నప్పుడు తమ ఇంట్లో కారు లేకపోవడం వల్ల అవసరం వచ్చినప్పుడు ఇతరుల్ని అడగాల్సి వచ్చేదని, అది తన తండ్రికి ఇబ్బందిగా ఉండేదని, ఇప్పుడు నాకు అవకాశాలు వచ్చాయి. అందుకే మా నాన్నగారికి నాలుగు కార్లు కొనిచ్చాను. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో తనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదని, ప్రస్తుతం నెలకు 8–9 వేల రెంట్ చెల్లిస్తూ జీవిస్తున్నానని తెలిపారు. ఇప్పుడున్న సినిమాల ద్వారా మంచి డబ్బు వస్తుందని భావిస్తున్నాను. త్వరలోనే ఒక ఇల్లు మా తల్లిదండ్రులకు ఇల్లు కొనిస్తాను, అప్పుడు మా వాళ్లు ఇంకా ఆనందపడతారు” అని చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story