చిరంజీవిని హెల్ప్ అడిగా.. లక్ష రూపాయలు ఇస్తారేమో అనుకున్నా కానీ.. ఫేమస్ నటుడు షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

తమిళ నటుడు పొన్నాంబళం.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం అన్ని భాషలు కలిపి దాదాపు 1500లకు పైగా సినిమాల్లో నటించాడు.

చిరంజీవిని హెల్ప్ అడిగా.. లక్ష రూపాయలు ఇస్తారేమో అనుకున్నా కానీ.. ఫేమస్ నటుడు షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: తమిళ నటుడు పొన్నాంబళం.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం అన్ని భాషలు కలిపి దాదాపు 1500లకు పైగా సినిమాల్లో నటించాడు. విలన్‌గా, కమెడీయన్‌గా తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి ఈయన ఇటీవల అనారోగ్యానికి గురై కఠినమైన వైద్య చికిత్సలు చేయించుకున్నాడు. మూత్రపిండాల సమస్యతో బాధ పడుతున్న ఈయనకు వైద్యం చేయించుకునేందుకు కూడా డబ్బు లేకపోవడంతో ఎంతో మంచి స్టార్ హీరోలను సహాయం అడిగినట్లు తెలిపారు. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పొన్నాంబళం.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మెగాస్టార్ చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘నేను అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు వైద్యం చేయించుకునేందుకు కూడా నా దగ్గర డబ్బు లేదు. అలాంటి సమయంలో చిరంజీవికి కాల్ చేసి సహాయం అడిగాను. ఆయన లక్ష రూపాయలు ఇస్తారని అనుకున్నాను. కానీ, ఇప్పటివరకు అతను నాకు కోటి రూపాయలకు పైగా సహాయం చేశాడు.. ఇలాంటి పని చేయడానికి బంగారు హృదయం కావాలి.. చిరంజీవి సర్ జీవితాంతం సంతోషంగా బతకాలి’ అని చెప్పుకొచ్చాడు.

ట్వీట్:

Next Story