Nidhi Agarwal: నేను యాక్సిడెంటల్ యాక్టర్‌ని కాదు.. దీని వెనుక ఎంతో కృషి ఉంది.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్.

Nidhi Agarwal: నేను యాక్సిడెంటల్ యాక్టర్‌ని కాదు.. దీని వెనుక ఎంతో కృషి ఉంది.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. తర్వాత మిస్టర్ మజ్ను మూవీలో నటించగా.. ఇస్మార్ట్ శంకర్‌తో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ.. తర్వాత తెలుగులో అంతగా మూవీస్ అనౌన్స్ చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటాకి సిద్ధం అయింది. ఇక రీసెంట్‌గా ‘వీరమల్లు’ నుంచి ట్రైలర్ రిలీజ్ కాగా.. అందులో నిధి లుక్‌కు యూత్ మరింత ఎట్రాక్ట్ అయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు. దీంతో ప్రజెంట్ సోషల్ మీడియాలో నిధి వైరల్ బ్యూటీగా మారిపోయింది.

అలాగే ప్రస్తుతం వరుస మూవీస్ ప్రకటిస్తూ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన సినీ కెరీర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు ‘నేను యాక్సిడెంటల్ యాక్టర్‌ని కాదు.. నిజానికి నాకు సినిమాలు అంటే చాలా పిచ్చి. ఆ పిచ్చితోనే ఎన్నో ఆడిషన్‌కి వెళ్ళాను. నాకు ఉన్న ఏకైక కల నటి కావడం. దాని కోసం ఎంతో కష్టపడ్డాను. ఇదంతా వర్కౌట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. త్వరలో రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ రెండు సినిమాలు నా కలను నిజం చేస్తాయని నేను భావిస్తున్నా’అంటూ చెప్పుకొచ్చింది.

Next Story